సీక్వెల్ కాదు.. కొత్త #90s అసలు మ్యాటర్ ఇదే
గత ఏడాది తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన #90s బయోపిక్ వెబ్ సూపర్ హిట్‌గా నిలిచింది.
గత ఏడాది తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన #90s బయోపిక్ వెబ్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఆ వెబ్ సిరీస్‌కి సీక్వెల్ రాబోతుంది అనే ప్రచారం జరుగుతోంది. వెబ్ సిరీస్‌ని రూపొందించిన దర్శకుడు ఆదిత్య హాసన్ ప్రస్తుతం ఆనంద్ దేవరకొండతో సినిమాకు రెడీ అయ్యాడు. తన మొదటి ప్రాజెక్ట్ హిట్ కావడంతో కొత్త సినిమా ప్రమోషన్ కోసం దాన్ని వాడుకున్నాడు. పైగా ఆ వెబ్ సిరీస్‌లో నటించిన శివాజీ, వాసుకిలు ఈ సినిమాలో అవే పాత్రల్లో కనిపించబోతున్నారు. దాంతో చాలా మంది #90sకి సీక్వెల్‌గా సినిమా రూపొందబోతుందని, ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది.
అసలు విషయం ఏంటి అంటే #90s బయోపిక్ వెబ్ సిరీస్‌కి ఈ సినిమాకు సంబంధం లేదు. దర్శకుడు, ఆ సినిమాలో నటించిన శివాజీ, వాసుకి మాత్రమే కామన్ పాయింట్. మిగిలిన కథ మొత్తం విభిన్నంగా ఉంటుంది. మిడిల్ క్లాస్ నుంచి విదేశాలకు వెళ్లిన ఒక కుర్రాడు అక్కడ ప్రేమలో పడతాడు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథాంశంగా తెలుస్తోంది. ఈ సినిమాలో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి మరోసారి ఈ సినిమాలో నటిస్తున్న నేపథ్యంలో ఆసక్తి మరింత పెరిగింది.
ఈమధ్య కాలంలో టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు నిర్మిస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. వందల కోట్ల బడ్జెట్ సినిమాల నుంచి చిన్న బడ్జెట్ సినిమాల వరకు నాగవంశీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను నిర్మిస్తూనే ఉన్నాడు. అందులో భాగంగానే ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా ఆదిత్య హాసన్ దర్శకత్వంలో సినిమాను రూపొందిస్తున్నారు. సినిమాను ఆరంభంలోనే జనాల్లోకి తీసుకు వెళ్లే ఉద్దేశ్యంతో హిట్ వెబ్ సిరీస్ అయిన #90s ని వాడుకున్నారు. అంతే తప్ప సీక్వెల్ కాదని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
వెబ్ సిరీస్‌కి సీక్వెల్‌ను తీయాలి అంటే మళ్లీ వెబ్ సిరీస్ తీస్తారు కానీ సినిమాను తీస్తారా అంటూ కొందరు చెబుతున్నారు. వెబ్ సిరీస్‌కి కంటిన్యూస్‌గా సినిమాను తీసే అవకాశాలు ఉంటాయి, తీసే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఈ సినిమా మాత్రం పూర్తిగా కొత్త కథతో రూపొందుతుందని తెలుస్తోంది. సినిమా ముందు ముందు ప్రమోషనల్ స్టఫ్‌లోనూ #90s బయోపిక్ ఇన్‌పుట్స్‌ను చాలానే వాడుకునే అవకాశాలు ఉన్నాయి. విభిన్నమైన కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కుతుంది. కనుక కచ్చితంగా ఈ సినిమాకు మంచి స్పందన వస్తుందేమో చూడాలి.