ఆనంద్ దేవరకొండ.. వ్వాటే లైనప్

సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా అన్న తరహాలోనే తమ్ముడు ఆనంద్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ లను సెలెక్ట్ చేసుకుంటున్నాడు.

Update: 2024-09-18 03:49 GMT

సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా అన్న తరహాలోనే తమ్ముడు ఆనంద్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ లను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం అతని లైనప్ చూస్తే భవిష్యత్తు లో మరిన్ని క్రేజీ కథలు రానున్నట్లు తెలుస్తోంది. ‘దొరసాని’ సినిమాతో ఆనంద్ దేవరకొండ టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా డిజాస్టర్టాక్ తెచ్చుకుంది. తరువాత ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ సినిమా OTT లో రాగా మంచి టాక్ అందుకుంది. నెక్స్ట్ వచ్చిన ‘పుష్పక విమానం’ అనే సినిమా ఏవరేజ్ అయ్యింది. ‘హైవే’ మూవీ ఫ్లాప్ అయ్యింది.

2022లో వచ్చిన ‘బేబీ’ మూవీ ఆనంద్ దేవరకొండ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో అతని నటనకి విమర్శకుల ప్రశంసలు సైతం లభించాయి. అలాగే బెస్ట్ యాక్టర్ గా సంతోషం అవార్డు వచ్చింది. ఫిల్మ్ ఫేర్ అవార్డుకి నామినేట్ అయ్యాడు. ఆనంద్ దేవరకొండ ఇమేజ్ పెంచడంతో పాటుగా తనకంటూ మార్కెట్ ని బేబీ మూవీ క్రియేట్ చేసింది. ఈ యంగ్ హీరో మెల్లమెల్లగా తన బ్రాండ్ ఇమేజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు.

ఈ ఏడాది గం గం గణేశా సినిమాతో ఆనంద్ దేవరకొండ థియేటర్స్ లోకి వచ్చాడు. ఈ సినిమా వర్క్ అవుట్ కాలేదు. అయితే ప్రస్తుతం జూనియర్ రౌడీ స్టార్ చేతిలో ఏకంగా నాలుగు సినిమాల వరకు ఉన్నాయంట. వైష్ణవి చైతన్యతో కలిసి డ్యూయెట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ప్రేమకథతోనే తెరకెక్కుతోంది. దీంతో పాటు మిడిల్ క్లాస్ మెలోడీస్ దర్శకుడు వినోద్ ఆనంతోజు దర్శకత్వంలో మరో సినిమాకి ఒకే చెప్పాడు.

అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఒక సినిమాకి కమిట్ అయ్యాడంట. బేబీ మూవీ ప్రొడ్యూసర్స్ అయిన SKN, సాయి రాజేష్ మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ లో మరొక సినిమాకి ఆనంద్ దేవరకొండ సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ కథలతోనే ఆనంద్ దేవరకొండ చేస్తున్నాడంట. మరీ ఓవర్ బిల్డప్ కథలు కాకుండా రియాలిటీకి దగ్గరగా ఉండే స్టోరీస్ ని ఎంపిక చేసుకొని మూవీస్ చేస్తున్నాడు.

ఇలాంటి కథలతో ప్రేక్షకులకి వేగంగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే తన మార్కెట్ ఎంత ఉందో చూసుకొని ఆ స్థాయిలో కథలని మాత్రమే సెలక్ట్ చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆనంద్ దేవరకొండ స్టోరీ సెలక్షన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుందనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

Tags:    

Similar News