రష్మికపై ప్రేమను బయటపెట్టిన విజయ్ తమ్ముడు
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మధ్య రిలేషన్‌షిప్ గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో డిస్కషన్స్ జరుగుతుంటాయి.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మధ్య రిలేషన్‌షిప్ గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో డిస్కషన్స్ జరుగుతుంటాయి. ఏ వెకేషన్ కు వెళ్లినా విజయ్ తో పాటూ రష్మిక వెళ్లడం, రష్మిక పోస్ట్ చేసిన ప్లేస్ లోనే విజయ్ ఫోటోలు కూడా ఉండటంతో వీరిద్దరూ ఎప్పటినుంచో కలిసే ఉంటున్నారని అంటుంటారు.
అయితే రష్మికకు కేవలం విజయ్ తోనే కాదు, విజయ్ ఫ్యామిలీతో కూడా మంచి బాండింగ్ ఉంది. ఆనంద్ దేవరకొండ నటించిన ఎన్నో సినిమాలను ప్రమోట్ చేయడమే కాకుండా, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కు, మూవీ ప్రీమియర్లకు కూడా వెళ్తూ దేవరకొండ ఫ్యామిలీతో ఉన్న బలమైన బంధాన్ని బయటపెట్టింది రష్మిక.
రీసెంట్ గా విజయ్ తల్లి మాధవి, రష్మిక కు గులాబీ పూలు పంపగా, రష్మిక ఆ ఫోటోని తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేస్తూ నన్ను ఎలా సంతోషంగా ఉంచాలో నీకు బాగా తెలుసు పాపలు అని రాసింది. దీంతో వారిద్దరి మధ్య ఎంత స్ట్రాంగ్ రిలేషన్ ఉందో రష్మిక చెప్పకనే చెప్పింది. ఇప్పుడు విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా రష్మికపై తన అభిమానాన్ని చాటుకున్నాడు.
ఛావా సినిమాతో రష్మిక వరుసగా మూడు బ్లాక్ బస్టర్లు అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆనంద్.. అల్లు అర్జున్, రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్ ముగ్గురు స్టార్ లతో మూడు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు అందుకున్నందుకు రష్మికకు విషెస్ చెప్తూ,వర్క్ పైన నీకున్న క్రమశిక్షణ, డెడికేషనే నీకు ఈ విజయాల్ని తెచ్చిపెట్టాయని రాసి ఓ ఫోటోను షేర్ చేశాడు.
దానికి రష్మిక మూడు హార్ట్ ఎమోజీలతో ఆనంద్ పోస్ట్ ను రీషేర్ చేసి దేవరకొండ ఫ్యామిలీతో తనకున్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసింది. దీంతో రష్మికకు, దేవరకొండ ఫ్యామిలీకి మధ్య ఉన్న ఈ బాండింగ్ నెక్ట్స్ లెవెల్ కు ఎప్పుడెప్పుడు వెళ్తుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కింగ్‌డమ్ సినిమా చేస్తున్న విజయ్, ఆ తర్వాత రాహుల్ సాంకృత్స్యన్ తో చేయబోయే సినిమాలో రష్మికతో కలిసి నటించనున్నాడు.