బేబీ జోడి.. ఈసారి ఏం చేస్తారో?

ఇక 'బేబీ' సక్సెస్ తరువాత ఈ ఇద్దరు నటులు ఎలాంటి ప్రయోగాలు చేస్తారు అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది.

Update: 2024-05-25 14:30 GMT

టాలీవుడ్ లో 'బేబీ' సినిమా సక్సెస్ తో గుర్తింపు పొందిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఇప్పుడు కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఒక బిగ్ సక్సెస్ చూసిన యువ నటీనటులు ఇటీవల కాలంలో మళ్ళీ వెంటనే డౌన్ అవుతున్నారు. తొందరపడి సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్టులు గట్టిగానే ప్రభావం చూపుతున్నాయి. ఇక 'బేబీ' సక్సెస్ తరువాత ఈ ఇద్దరు నటులు ఎలాంటి ప్రయోగాలు చేస్తారు అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది.

'లవ్ మీ' సినిమా ద్వారా వైష్ణవి చైతన్య తన రెండవ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో ఆమె అశిష్ రెడ్డితో జతకట్టారు. తొలి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యాక, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా ఆడుతుందో చూడాలి. ప్రోమోషన్లలో వైష్ణవి ఎంతో జోష్ గా పాల్గొంటూ, పాటలు పాడుతూ ప్రేక్షకులకు చేరువవుతున్నారు. సినిమాలో ఆమె యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్రలోనే నటించింది. ఇక కమర్షియల్ హిట్ అయితే అమ్మడి రేంజ్ మరో లెవెల్ కు వెళుతుంది.

మరోవైపు ఆనంద్ దేవరకొండ విషయానికి వస్తే, 'గమ్ గమ్ గణేష్' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో ప్రగతి శ్రీవాత్సవ హీరోయిన్ గా నటిస్తున్నారు. 'బేబీ' సినిమా తరువాత తన అభిమానులను మరింత ఆకట్టుకునేందుకు ఆనంద్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. 'బేబీ' సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ సాధించిన నేపథ్యంలో ఈ రెండు సినిమాలు ఎలాంటి రిజల్ట్ తెస్తాయో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

'లవ్ మీ' సినిమా ద్వారా వైష్ణవి ఎలా మెప్పిసస్తుందో, 'గమ్ గమ్ గణేష్' ద్వారా ఆనంద్ ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకుంటారో చూడాలి. ఈ రెండు సినిమాలు నటీనటుల ప్రతిభను కొత్త కోణంలో పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. వైష్ణవి తన గాత్రంతో పాటలు పాడటం, ఆనంద్ తన అభినయం ద్వారా ప్రేక్షకులను మరింత ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

మొత్తానికి 'బేబీ' జంట ఈ కొత్త ప్రయోగాల్లో ఎలా విజయం సాధిస్తారో చూడాలి. ఇక రాబోయే రోజుల్లో కూడా వీరి నుంచి మరిన్ని డిఫరెంట్ ప్రాజెక్టులు రాబోతున్నాయి. సైష్ణవి ఇప్పటికే ఒక యువ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు టాక్ వస్తోంది. అలాగే మరోవైపు ఆనంద్ దేవరకొండ కొత్త డైరెక్టర్ తో డిఫరెంట్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News