అఖిల్ ని చూసి ఆనంది అలా ఫీలవుతుంది!
చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
తెలుగు నటి ఆనంది సుపరిచితమే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమై హీరోయిన్ గా ప్రమోట్ అయింది. అందం, అభినయం గల నాయిక. సరైన అవకాశాలు రాలేదు గానీ వస్తే ఇంకా ఫేమస్ అయ్యేది. 'జాంబీరెడ్డి', శ్రీదేవి సోడా సెంటర్, 'ఇట్లు మారేడు మిల్లు ప్రజానీకం' లాంటి చిత్రాల్లో నటించింది. డెబ్యూ సినిమాలో తెలుగులోనే చేసింది. అటుపై కోలీవుడ్ కి వెళ్లింది. అక్కడ మాత్రం అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అలాగే తమిళ సినిమాల్లోనూ యధావిధిగా కొనసా గుతుంది. ఆనంది ఇప్పటికే పెళ్లి చేసుకుంది. ఓ బేబి కూడా ఉంది. తాజాగా ఓ షోలో ఆనంది అఖిల్ బ్యూటీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ షోకు ముఖ్య అతిధిగా హాజరు కాగా? అఖిల్ అందానికి ఆనంది ఫిదా అయింది. దీంతో మనసులో భావాన్ని దాచకుండా ఉండలేకపోయింది. అఖిల్ ని స్పాట్ లో చూసి తొందరగా పెళ్లి చేసుకుని ఇప్పుడు ఫీలవుతున్నాననేసింది.
దీనికి అఖిల్ ఎంతో సంతోష పడ్డాడు. ఇంత అందమైన హీరోయిన్ అభిమానిగా ఉన్నందుకు ఆనందం వ్యక్తం చేసాడు. హ్యాండ్సమ్ హీరోల్ని చూసినప్పుడు నటీమణులు ఇలా ఒపెన్ అవ్వడం అన్నది సర్వ సాధారణం. అదంతా వారు చూపించే అభిమానం. సూపర్ స్టార్ మహేష్ తో ఒక్క సినిమా అయినా చేయాలని దీపికా పదుకొణే వెయిట్ చేస్తుంది. ఆ ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంది.
అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేయాలని చాలా మంది హీరోయిన్లు కలలు కంటున్నారు. ఇంకా ఇలాంటి చిట్టా తీస్తే చాలా పెద్దదవుతుంది. ప్రస్తుతం ఆనంది రెండు భాషల్లోనూ నటిగా కొనసాగుతుంది. మనుపటి కంటే ఇప్పుడు మరింత మెరుగ్గా తెలుగు సినిమా అవకాశాలు అందుకుంటుంది. కోలీవుడ్ ..టాలీవుడ్ లో సినిమాలు చేయడంతో చెన్నై టూ హైదరాబాద్ తిరుగుతుంది.