8 వసంతాలు… అనంతిక డెడికేషన్ కి వావ్ అనాల్సిందే

హీరోయిన్స్ కూడా ఈ విషయంలో ఏ మాత్రం తక్కువ కాదని కొందరు ప్రూవ్ చేస్తారు.

Update: 2024-10-18 06:34 GMT

సినిమాలో క్యారెక్టర్స్ లో పర్ఫెక్షన్ కోసం హీరోలు తమని తాము పూర్తిగా మార్చేసుకుంటారు. అలాగే రియలిస్టిక్ గా రావడం కోసం కొన్ని సాహసాలు చేస్తారు. యాక్షన్ సీక్వెన్స్ ల కోసం మార్షల్ ఆర్ట్స్ లాంటివి నేర్చుకుంటారు. పాత్రని ప్రేమిస్తే యాక్టర్స్ ఎంత వరకైనా వెళ్తారని చెప్పొచ్చు. ఇలా పాత్రకి తగ్గట్లుగా తమని తాము మార్చుకోవడానికి సిద్ధంగా ఉండేవారిలో సౌత్ లో చియాన్ విక్రమ్, బాలీవుడ్ లో అమీర్ ఖాన్ కనిపిస్తారు. అందుకే వీరికి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది.


హీరోయిన్స్ కూడా ఈ విషయంలో ఏ మాత్రం తక్కువ కాదని కొందరు ప్రూవ్ చేస్తారు. అలాంటివారిలో తాప్సి ముందు వరుసలో ఉంటుంది. మిథాలీ రాజ్ క్యారెక్టర్ కోసం ఆమె క్రికెట్ నేర్చుకుంది. అలాగే ఓ సినిమాలో అథ్లెట్ పాత్ర కోసం రన్నింగ్ లో శిక్షణ తీసుకుంది. ఫీమేల్ సెంట్రిక్ కథలు చేసే సమయంలో క్యారెక్టర్స్ కోసం వారు ఎంత శ్రద్ధ పెట్టారనే దానిని బట్టి వారి డెడికేషన్ ఏంటనేది తెలుస్తుంది.

మైత్రీ మూవీ మేకర్స్ లో ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో ‘8 వసంతాలు’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఫిమేల్ సెంట్రిక్ కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సుద్ధి అయోధ్య పాత్రలో అనంతిక సునీల్ కుమార్ నటిస్తోంది. రీసెంట్ గా ఆ క్యారెక్టర్ టీజర్ ని విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మంచి ఇంటెన్షన్ తో కథ ఉండబోతోందని టీజర్ తోనే స్పష్టం అయ్యింది.

ఇదిలా ఉంటే తాజాగా సుద్ధి అయోధ్య క్యారెక్టర్ కోసం అనంతిక ఎంత ఎఫర్ట్స్ పెట్టిందనేది ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇందులో అనంతిక మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటుంది. సుద్ధి అయోధ్య క్యారెక్టర్ కోసం అనంతిక ఎలా సిద్ధమైందో ఈ వీడియోలో చూపించారు. మూడు నెలల పాటు ఆమె మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకొని షూటింగ్ కి రెడీ అయినట్లు ఈ వీడియోలో తెలియజేశారు.

పాత్రని ఆమె ఎంతగా ప్రేమించి చేసిందనేది ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. ఇక సినిమాకి హెసమ్ అబ్దుల్ వాహెబ్ అద్భుతమైన మెలోడీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. టీజర్ తో పాటు ఇప్పుడు రిలీజ్ చేసిన వీడియోలో అతని మ్యూజిక్ కూడా క్యారెక్టర్ ఇంటెన్షన్, ఎమోషన్ ని పెర్ఫెక్ట్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేస్తోందనే మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News