అంబానీ వారి సంగీత్.. ముంబైని రీ క్రియేట్
గత కొన్ని నెలలుగా జరుగుతున్న ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలకు ముగింపు పలుకుతూ ఈనెల 12న రాధిక మెడలో అనంత్ అంబానీ తాళి కట్టబోతున్నాడు.
భారతదేశంలో అంబానీ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న వ్యాపార దిగ్గజ కుటుంబ అంబానీ ఫ్యామిలీ. ప్రపంచంలోని పదుల దేశాల్లో తమ వ్యాపారాలను విస్తరించిన అంబానీ ఫ్యామిలీ ఇంట వేడుక అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ప్రస్తుతం ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ల వివాహం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత కొన్ని నెలలుగా జరుగుతున్న ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలకు ముగింపు పలుకుతూ ఈనెల 12న రాధిక మెడలో అనంత్ అంబానీ తాళి కట్టబోతున్నాడు.
సాధారణంగా సెలబ్రిటీల పెళ్లి వేడుకలో సంగీత్ ను ఒక రోజు నిర్వహిస్తారు. కానీ అంబానీ వారి ఇంట అలా జరిగితే స్పెషల్ ఏం ఉంది అనుకున్నారో ఏమో కానీ ఏకంగా మూడు రోజుల పాటు సంగీత్ ను ప్లాన్ చేశారు అంటూ సమాచారం అందుతోంది. పదుల కోట్ల పారితోషికం ఇచ్చి ప్రముఖ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ను ముంబై కి రప్పించారు.
ఇక శుక్రవారం జరిగిన సంగీత్ వేడుకల కోసం వేసిన సెట్టింగ్ మహా అద్భుతం అన్నట్లుగా ఉంది అంటూ కార్యక్రమానికి హాజరు అయిన వారు అంటున్నారు. పాత బాలీవుడ్ సినిమాల్లో ముంబై ని ఎలా అయితే చూపించారో అలా ఈ సెట్టింగ్ నిర్మాణం జరిగిందని తెలుస్తోంది.
అంతే కాకుండా ముఖేష్ అంబానీ, నీతా అంబానీ లు తమ మనవళ్లు, మనవరాళ్లు తో ఒక వింటేజ్ కారులో ప్రయాణిస్తున్న వీడియో కూడా తెగ వైరల్ అయ్యింది. మొత్తానికి అంబానీ వారి ఇంట పెళ్లి సందడి ఏమో కానీ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో సందడి వాతావరణం నెలకొంది.