మ‌ల్లెపూల టాప్‌లో మ‌త్తు క‌ళ్ల జవానీ

అనన్య తాజా ఫోటోషూట్ వెబ్ లో విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది. ఈ ఫోటోషూట్ లో అన‌న్య బోల్డ్ లుక్ తో మైమ‌రిపిస్తోంది. మ‌ల్లెపూల‌తో రూపొందించిన డిజైన‌ర్ టాప్ ని ధ‌రించి యూనిక్ స్టైల్‌లో క‌నిపించింది.

Update: 2025-01-23 14:44 GMT

'లైగ‌ర్' చిత్రంతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైంది అన‌న్య పాండే. ఈ భామ వృత్తిగ‌త‌, వ్య‌క్తిగ‌త జీవితం తెరిచి ఉంచిన పుస్త‌కం. బాలీవుడ్ హీరో ఆదిత్యారాయ్ క‌పూర్ నుంచి విడిపోయిన త‌ర్వాత అన‌న్య‌ కొంత నిరాశ‌లో కూరుకుపోయింది. అయినా ఇప్పుడు న‌ట‌నా కెరీర్‌పైనే పూర్తిగా దృష్టి సారించింది.

 

 

మ‌రోవైపు నిరంత‌ర ఫోటోషూట్ల‌తో త‌న ఇన్‌స్టా ఫాలోవ‌ర్స్ కి ఈ బ్యూటీ అద్భుత‌మైన ట్రీటిస్తోంది. అనన్య తాజా ఫోటోషూట్ వెబ్ లో విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది. ఈ ఫోటోషూట్ లో అన‌న్య బోల్డ్ లుక్ తో మైమ‌రిపిస్తోంది. మ‌ల్లెపూల‌తో రూపొందించిన డిజైన‌ర్ టాప్ ని ధ‌రించి యూనిక్ స్టైల్‌లో క‌నిపించింది. బాట‌మ్ లో తెలుపు- బంగారు రంగుతో డిజైన్ చేసిన పొడ‌వాటి శారీని శ‌రీరంపై ఆచ్ఛాద‌న‌గా క‌ప్పుకుని క‌నిపించింది.

 

ప్ర‌స్తుతం ఈ అద్భుత‌మైన ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. అన‌న్య ప్ర‌యోగాత్మ‌క ఆలోచ‌న‌ల‌కు యువ‌త‌రం ఫిదా అయిపోతోంది. ఎంపిక చేసుకున్న‌ మ‌ల్లె పూల టాప్ కి అనుగుణంగానే, త‌న హెయిర్ ని ఫ్రీ అండ్ ఫ్లో స్టైల్లో ఎలివేట్ చేసింది అన‌న్య‌. ఓవ‌రాల్ గా అన‌న్య లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. దీనిపై ఒక రేంజులో కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ యూనిక్ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది.

Tags:    

Similar News