ఐటం పాట‌ల్లో పాండే బ్యూటీ కండీష‌న్లు!

ఈ క‌ల్చ‌ర్ దాదాపు అన్ని భాష‌ల్లోనూ ఉంది. ముఖ్యంగా టాలీవుడ్..బాలీవుడ్..కోలీవుడ్లో క‌నిపిస్తుంటుంది.

Update: 2024-09-30 09:30 GMT

ఐటం పాట‌ల‌కు ఏ న‌టి ఒకే చెప్పినా? పెద్ద‌గా కండీష‌న్లు అంటూ ఏవీ లేకుండానే నటిస్తున్నారు . ఐటం పాట అంటేనే యువ‌తలో ఊపు తెచ్చేది. ఆపాట‌ని క‌మ‌ర్శియ‌ల్ కోణంలో డిజైన్ చేసి సినిమాల్లో పెడు తుంటారు. ఆ పాట కోసం స్టోరీ డిమాండ్ చేయాల్సిన ప‌నిలేదు. స‌న్నివేశానికి నాన్ సింక్ అవుతుంది? అనే అవ‌స‌రం లేదు. క‌మ‌ర్శియ‌ల్ సినిమా అయినా..పీరియాడిక్ స్టోరీ అయినా హాట్ బ్యూటీతో ఐటం పాట అన్న‌ది? ఓ స్పెష‌ల్ గా భావిస్తారంతా.

ఈ క‌ల్చ‌ర్ దాదాపు అన్ని భాష‌ల్లోనూ ఉంది. ముఖ్యంగా టాలీవుడ్..బాలీవుడ్..కోలీవుడ్లో క‌నిపిస్తుంటుంది. ఐటం పాటల్లో స్టార్ హీరోయిన్లే న‌టిస్తున్నారు. ఎలాంటి కండీష‌న్లు పెట్ట‌కుండా అందాలు ఆర‌బోస్తున్నారు. హీరోయిన్లు ఇలాంటి ట‌ర్నింగ్ తీసుకోవ‌డంతో ప్రోఫెష‌న‌ల్ ఐటం గాళ్స్ కి డిమాండ్ త‌గ్గింద‌న్న‌ది వాస్త‌వం. ఫాంలో ఉన్నా లేక‌పోయినా? మంచి పారితోషికం వ‌స్తుందంటే నో చెప్ప‌కుండా ప‌నిచేస్తున్నారు.

తాజాగా `లైగ‌ర్` బ్యూటీ అన‌న్యా పాండే కూడా ఐటం పాట‌ల‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. అయితే అమ్మ‌డు ఇక్క‌డ కండీష‌న్లు అప్లై అంటోంది. అన్ని సినిమాల్లోనూ ఐటం పాట‌ల్లో న‌టించ‌న‌ని...కేవ‌లం ఐటం పాట‌లు డిమాండ్ చేసే సినిమాలు త‌ప్ప‌! మిగతా సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చిన అలాంటి పాట‌లు చేయ‌నంటోంది.పాట‌లో అమ్మాయికి ప్రాధాన్య‌త‌తో పాటు, దాన్ని గౌర‌వంగా భావించేలా ఉండాలి అంటోంది.

అలాంట‌ప్పుడే ఐటం పాట‌లో న‌టిస్తుందిట‌. త‌న నియ‌మాలకు అనుగుణంగా ఐటం పాట‌లు వ‌స్తే చేస్తాను త‌ప్ప లేదంటే నిర్మొహ‌మాటంగా నో చెప్పాస్తాను అంది. ఐదేళ్ల న‌ట జీవితంలో ఇంత‌వ‌ర‌కూ ఐటం పాట‌లు చేయ‌లేదు. వ‌స్తే మాత్రం ఇలాండి కండీష‌న్లు మ‌ద్య ఒకే చెబుతుందిట‌.

.

Tags:    

Similar News