పింక్ ఫ్రాక్ లో మ‌తులు చెడ‌గొడుతోంది!

అనన్య పాండే ఇప్పుడు పింక్ లుక్ లో గుబులు రేపుతోంది. అద్భుతమైన పింక్ కో-ఆర్డ్ సెట్ తో అందంగా కనిపించిన అన‌న్య‌ మాన్‌సూన్స్ ని పిలుస్తున్న‌ట్టుగా ఉంది.

Update: 2023-08-18 16:26 GMT

లైగ‌ర్ చిత్రంతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైంది అనన్య పాండే. అయితే ఈ సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో బ్యాక్ టు ద పెవిలియ‌న్ అంటూ బాలీవుడ్ కే వెళ్లిపోయింది. అక్కడ వ‌రుస‌గా సినిమాలు చేస్తోంది. ప్ర‌స్తుతం మోస్ట్ అవైటెడ్ మూవీ 'డ్రీమ్ గర్ల్2'లో న‌టించింది. ఈ సినిమా రిలీజ్ ప్ర‌మోష‌న్స్ లో అన‌న్య బిజీబిజీగా ఉంది.


అదే క్ర‌మంలో అన‌న్య పాండే ర‌క‌ర‌కాల డిజైన‌ర్ లుక్కుల‌తో ప్రెస్ మీట్ల‌లో రేపుతోంది. అనన్య ఫ్యాషన్ స్టేట్ మెంట్ ప్ర‌తిసారీ చర్చకు వ‌స్తోంది. ఈసారి కూడా త‌ను ధ‌రించిన‌ పింక్ ఫ్రాకుపై నెటిజ‌నుల్లో ర‌చ్చ కొన‌సాగుతోంది. చీరల నుండి సొగసైన స్ట్రీట్ డిజైన‌ర్ డ్రెస్సుల వరకు అన్ని మోడ‌ల్స్ ని కోరుకునే యువతను ఆకర్షించే అంద‌మైన యువ‌తిగా అన‌న్య‌కు ఉన్న ఫాలోయింగ్ గొప్ప‌ది.

అనన్య పాండే ఇప్పుడు పింక్ లుక్ లో గుబులు రేపుతోంది. అద్భుతమైన పింక్ కో-ఆర్డ్ సెట్ తో అందంగా కనిపించిన అన‌న్య‌ మాన్‌సూన్స్ ని పిలుస్తున్న‌ట్టుగా ఉంది. ఈ సీజ‌న్ కి వెరీ స్పెష‌ల్ లుక్ ఇది అని అర్థ‌మ‌వుతోంది. ఈ డిజైన‌ర్ డ్రెస్ కి చాలా ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. ఆ గుండ్రని నెక్‌లైన్ తో అన‌న్య‌ ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది. గులాబీ రంగులో నిగనిగలాడే పెదవులు ..ఎర్రబడిన బుగ్గలతో ప్లెయిన్ లుక్ లో అన‌న్య‌ శైలి క‌ట్టి ప‌డేస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైర‌ల్ గా మారింది.

ప్ర‌స్తుతం డ్రీమ్ గ‌ర్ల్ అభిమానులు సీక్వెల్ వీక్ష‌ణ కోసం క్యూరియ‌స్ గా వేచి చూస్తున్నారు. ఈ చిత్రంలో పరేష్ రావల్, విజయ్ రాజ్, అన్నూ కపూర్, రాజ్‌పాల్ యాదవ్, సీమా పహ్వా, మంజోత్ సింగ్, అభిషేక్ బెనర్జీ త‌దిత‌రులు న‌టించారు. రాజ్ శాండిల్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ఏక్తా కపూర్- శోభా కపూర్ నిర్మించారు. డ్రీమ్ గర్ల్ 2 ఆగష్టు 25 న థియేటర్లలోకి రానుంది.

Tags:    

Similar News