నెమలి చీరలో అనసూయ హొయలు

ఇటీవల పర్పుల్ బేస్ కలర్ శారీలో తీసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ, సాంప్రదాయ లుక్ లో తన అందాన్ని మరింత బాగా హైలైట్ చేసింది.

Update: 2024-11-05 16:30 GMT

తెలుగు చిత్రపరిశ్రమలో తన ప్రత్యేకమైన స్టైల్, అందంతో తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో తన సరికొత్త శారీ లుక్ తో కవ్వించిపోతుంది. ఇటీవల పర్పుల్ బేస్ కలర్ శారీలో తీసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ, సాంప్రదాయ లుక్ లో తన అందాన్ని మరింత బాగా హైలైట్ చేసింది.

ఆమె పెదవులపై చిరునవ్వు, వినూత్నమైన బ్లౌజ్ డిజైన్ తో ముద్దుగుమ్మ అందరి మనసులు దోచేస్తోంది. అనసూయ ఈ ఫోటోలకు మంచి వింటేజ్ లుక్ ఇచ్చి స్టైలిష్ గా కనిపించారు. ఆమె జ్యూవెలరీ చాయిస్ కూడా ఈ లుక్ ను మరింత మెరుగు పరచింది. బంగారు, వెండి కలర్ కలిపి ఉన్న ఈ శారీలో అనసూయ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తూ, సాంప్రదాయానికి మోడ్రన్ టచ్ ను కలిపి తనకే ఉన్న ప్రత్యేకతను చాటిచెప్పారు.

మేకప్ సింపుల్ గా ఉండగా, హెయిర్ స్టైల్ కూడా ఆమె శైలిని మరింత మెరుగుపరిచింది. ఈ ఫోటోలను పోస్ట్ చేస్తూ అనసూయ తన అభిమానులకు ప్రత్యేక సందేశం ఇచ్చింది. నెమలి లాంటి అందం అంటూ ఏమోజీలతో తన జీవన విధానాన్ని పంచుకున్నారు. ఆమె ఇచ్చిన ఈ క్యాప్షన్ అభిమానులను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది.

మహిళలు కేవలం అందంతో కాకుండా, ధైర్యసాహసాలతోనూ ముందుకు సాగాలి చాలాసార్లు ఆమె తన ఆలోచన విధానం తో స్పూర్తి నింపారు. ఈ కొత్త లుక్ తో అనసూయ మరోసారి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అనసూయ ఎక్కడ ఉన్నా, ఏం చేసినా దానిని ప్రత్యేకంగా తీర్చిదిద్దుకుంటూ, తనలోని గ్లామర్ తో పాటు, ఆమెలోని తెలివితేటలతో ఆకట్టుకుంటుంది. ఇక ప్రస్తుతం అనసూయ పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పుష్ప 2లో ఆమె ఈసారి మరింత పవర్ఫుల్ గా కనిపించబోతోంది.

 

Tags:    

Similar News