చీరలో అనసూయ మాయ.. వావ్ అనాల్సిందే..

సింపుల్ లుక్‌ లో కూడా ఈ స్థాయిలో అందంగా కనిపించడమే అనసూయ స్పెషాలిటీ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Update: 2025-02-24 11:28 GMT

సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా అనసూయ భరద్వాజ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. రెగ్యులర్ ఆమె గ్లామరస్ ఫొటో షూట్స్ తో తన క్రేజ్ ను పెంచుకుంటోంది. రీసెంట్ గా అనసూయ భరద్వాజ మరోసారి తన అందం, స్టైల్‌ తో అభిమానులను ఆకట్టుకుంటోంది. తెలుపు రంగు చీరలో డిజైనర్ డ్రెస్‌ తో ఆమె ఇచ్చిన హావభావాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


సింపుల్ లుక్‌ లో కూడా ఈ స్థాయిలో అందంగా కనిపించడమే అనసూయ స్పెషాలిటీ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ లేటెస్ట్ ఫోటోషూట్ లో అనసూయ తళుక్కున మెరిసిపోతూ కనిపిస్తోంది. తెల్ల చీరపై ఆరంజ్ బోర్డర్ తో సాంప్రదాయ హంగులను కలిపిన ఆవుట్ ఫిట్ ఆమె అందాన్ని మరింత హైలైట్ చేస్తోంది. నవ్వుతూ ఇచ్చిన పొజ్‌ లో అనసూయ గ్రేస్‌ ఫుల్‌ గా కనిపిస్తోంది. ఇయరింగ్‌ లు, వాచ్‌ తో తన స్టైల్‌ కు మరింత అందం చేర్చుకుంది.


అనసూయ ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగానే లైక్‌ ల వర్షం కురుస్తోంది. "మీ స్పీడ్ కంటే మీ డైరెక్షన్ చాలా ముఖ్యం" అంటూ ఇచ్చిన క్యాప్షన్ మరింత ఆకర్షణగా నిలిచింది. ఆమె చిరునవ్వు, కళ్లలోని తీయదనం ఫోటోలకు కొత్త హావను తెచ్చింది. ఈ మధ్య అనసూయ ఫ్యాషన్, ఫోటోషూట్‌ లతో నెట్టింట హాట్ టాపిక్ గా మారుతోంది. ఆమె పోస్ట్ చేసే ప్రతి లుక్‌ ట్రెండింగ్ అవుతూనే ఉంది.


సినిమా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నా, అనసూయ తన స్టైలిష్‌ లుక్స్ తో అభిమానులను ఎప్పటికప్పుడు కనువిందు చేస్తోంది. ప్రస్తుతం అనసూయ పలు సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. అయితే, ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే స్టన్నింగ్ ఫోటోలు మాత్రం ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ లేటెస్ట్ చీర లుక్ తో అనసూయ మరోసారి ఫ్యాషన్ స్టేట్‌మెంట్ ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News