జానీ మాష్టర్ వేధింపులపై పరిష్కార ప్యానెల్!
కొరియోగ్రాఫర్ జానీ భాషా అలియాస్ జానీ మాష్టర్ పై ఓ యువతి లైంగిక ఆరోపణ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
కొరియోగ్రాఫర్ జానీ భాషా అలియాస్ జానీ మాష్టర్ పై ఓ యువతి లైంగిక ఆరోపణ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ సహా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడీ టాపిక్ సంచలనమవుతోంది. హైదరాబాద్, చెన్నై, ముంబై ఇలా ఔట్ డోర్ షూటింగ్ లకు వెళ్లినప్పుడు లైంగిక కోరికలు తీర్చుకునేవాడని అతడి సహాయకురాలు(21) పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే నార్సింగ్ లో తన నివాసానికి వచ్చి కూడా పలుమార్లు వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది.
దీంతో నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ పై ఎఫ్ ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియా ఒక్కసారిగా వెడక్కింది. నెటి జనులు జానీ మాస్టర్ పై మండిపడుతున్నారు. దీనిపై గాయని చిన్మయి కూడా స్పందించింది. ఆ యువతి మైనర్ గా ఉన్నప్పుడే ఇలాంటి దాష్టికానికి తెగబడ్డాడని మండిపింది. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
సీన్ లోకి నటి పూనమ్ కౌర్ కూడా వచ్చింది. `అతడని మాస్టర్ అని పిలవొద్దు` అని కోరింది. `నిందితుడు షేక్ జానీ అని పిలవాలని` అంది. `మాస్టర్ అనే పదవికి ఇలాంటి వాళ్లు కళంకం` తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ సబ్యురాలు ఝాన్సీ కూడా స్పందించారు.
`బాధితురాలు మొదట మీడియాను ఆశ్రయించింది. మీడియా ఈ ఘటనను మా ముందుకు తీసుకొచ్చింది. పని ప్రదేశంలో వేధింపులున్నాయంటూ తొలుత ఆ అమ్మాయి ఛాంబర్ ని ఆశ్రయించింది. ఆ తర్వాత లైంగిక వేధింపుల గురించి బయట పెట్టింది. దీనిపై చట్టపరమైన విచారణ జరుగుతుంది` అని అన్నారు. అయితే మీడియా కంటే ముందే ఆ యువతి వేధింపులపై ఛాంబర్ ని ఆశ్రయించినప్పుడు ఆ విషయాన్ని ఛాంబర్ మీడియా ముందుకు తీసుకురానట్లు తెలుస్తోంది.