పవన్ టైటిల్స్.. వారసుడికి ఒక్కటైన ఉంచండయ్యా..
రీసెంట్ గా యాంకర్ ప్రదీప్.. పవర్ స్టార్ డెబ్యూ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టైటిల్ ను తన సినిమాకు పెట్టుకున్నారు. ఫస్ట్ లుక్ కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.
సినీ ఇండస్ట్రీలోకి ఎందరో వారసులు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ విధంగానే మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అనేక మంది వారసులొచ్చారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి దుర్గా తేజ్.. సినిమాల్లోకి వచ్చారు. త్వరలో అకీరా నందన్ కూడా సినీ ఎంట్రీ ఇవ్వనున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా రేణు దేశాయ్ కూడా అకీరా కెరీర్ విషయంలో నిర్ణయం తనకే వదిలేస్తున్నట్లు తెలిపారు.
ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక అకీరా డెబ్యూ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీతో సినిమాల్లోకి అకీరా అడుగు పెడుతున్నట్లు టాక్ వినిపించింది. కానీ అది నిజం కాదని తెలిసింది. అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు అకీరా నందన్ కోసం డిస్కషన్ జరుగుతుంది. అకీరా నందన్ కోసం టైటిల్స్ ఉంచడయ్యా అని కామెంట్లు పెడుతున్నారు పవన్ ఫ్యాన్స్. అసలేం జరిగిందంటే?
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ మొత్తం సినిమాల సంఖ్య ముప్పై లోపే ఉంటుంది. ప్రస్తుతం మూడు చిత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి. అయితే పవన్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. వాటిలో పలు సినిమాలు టైటిల్స్ ను కొన్నేళ్లుగా కొందరు హీరోలు తమ సినిమాలకు పెట్టుకుంటున్నారు. తొలి ప్రేమ టైటిల్ ను వరుణ్ తేజ్.. ఖుషిని విజయ్ దేవరకొండ.. తమ్ముడుని నితిన్ తీసుకున్నారు.
రీసెంట్ గా యాంకర్ ప్రదీప్.. పవర్ స్టార్ డెబ్యూ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టైటిల్ ను తన సినిమాకు పెట్టుకున్నారు. ఫస్ట్ లుక్ కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. త్వరలోనే మూవీ కూడా రిలీజ్ చేయనున్నారు. అలా పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రాల టైటిల్స్ లో చాలా మంది యంగ్ హీరోలు వాడేసుకున్నట్లే. ఇక సుస్వాగతం, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది టైటిల్స్ మాత్రమే మిగిలాయనే చెప్పాలి.
ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. పవన్ ఫ్యాన్స్ తెగ స్పందిస్తున్నారు. అందరూ అన్ని టైటిల్స్ వాడేస్తే.. అకీరాకు ఇంకా ఏం మిగలవేమో అని అంటున్నారు. కొన్నైనా ఉంచండయ్యా అని కామెంట్లు పెడుతున్నారు. ఇదే రిపీట్ అయితే అకీరాకు ఇంకేం మిగలవని వాపోతున్నారు. సినిమా తగ్గట్టు టైటిల్ ను పెట్టుకోవాలని సూచిస్తున్నారు. కానీ ఇప్పటికే రిజిస్టర్ అయినవి యూజ్ చేయొద్దని చెబుతున్నారు. మరి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చూడాలి.