స్రవంతి.. కిల్లర్ లుక్స్ కేక!

తెలుగు బుల్లితెర భామలు కూడా ఈ మధ్యకాలంలో అందంతో అందరిని ఆకట్టుకుంటున్నారు

Update: 2024-08-05 03:56 GMT

 తెలుగు బుల్లితెర భామలు కూడా ఈ మధ్యకాలంలో అందంతో అందరిని ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా యాంకర్స్ గా చేస్తున్న బ్యూటీస్ అయితే గ్లామర్ షోతో కట్టిపడేస్తున్నారు. తెలుగు బుల్లితెరపై అనసూయ మొదటిసారిగా గ్లామర్ టచ్ తో యాంకర్ గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఆమె తర్వాత రష్మీ గౌతమ్ కూడా గ్లామర్ బ్యూటీగా మంచి ఇమేజ్ తెచ్చుకుంది. వారి దారిలో వర్షిణి, దీపికా పిళ్ళై, విష్ణు ప్రియ లాంటి బ్యూటీస్ గ్లామర్ యాంకర్స్ గా బుల్లితెరపై అందరిని ఆకట్టుకున్నారు.

వీరి దారిలో యుట్యూబ్ లో యాంకర్స్ గా కెరియర్ స్టార్ట్ చేసిన అరియనా గ్లోరీ, స్రవంతి చొక్కారవు కూడా అందరి దృష్టిని ఆకర్షించారు. సోషల్ మీడియాలో మంచి ఫేమ్ సంపాదించుకొని బిగ్ బాస్ హౌస్ లోకి ఈ బ్యూటీస్ ఎంట్రీ ఇచ్చారు. అక్కడ టాప్ కంటిస్టెంట్ లుగా విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు.. బిగ్ బాస్ తో స్రవంతి చొక్కారపు మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. తరువాత హోస్ట్ గా ఈ అమ్మడు కొనసాగుతోంది.

అయితే టీవీ షోలకి కాకుండా సినిమా ఈవెంట్స్ కి ఎక్కువగా హోస్ట్ గా వ్యవహరిస్తోంది. యాంకర్ సుమ పెద్ద పెద్ద సినిమాలని హ్యాండిల్ చేస్తుంటే మీడియం రేంజ్, చిన్న సినిమాలకి స్రవంతి హోస్ట్ గా చేస్తూ తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ బ్యూటీకి ఇన్ స్టాగ్రామ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రెగ్యులర్ గా గ్లామర్ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి.

తాజాగా ఫ్రెండ్ షిప్ డే విషెస్ చెబుతూ స్రవంతి లైట్ గ్రీన్ కలర్ అవుట్ ఫిట్ ధరించిన ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలకి నెటిజన్లు నుంచి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ పిక్స్ లో అందంతో స్రవంతి మాయ చేస్తోందనే మాట నెటిజన్లు నుంచి వినిపిస్తోంది. హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని గ్లామర్ తో స్రవంతి మెరిసిపోతోందని కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News