32 కోట్ల బడ్జెట్ మూవీ 456 కోట్ల వసూల్
2018లో వచ్చిన ఈ సినిమా కేవలం రూ.32 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. అంధాధున్ ఒక కొత్త కథను తెరపై ఆవిష్కరించింది. ఇది ప్రేక్షకులను చివరి వరకు సస్పెన్స్ లో ఉంచే కథాంశం
కేవలం రూ. 32 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఒక సినిమా ఏకంగా రూ. 456 కోట్లు వసూలు చేసింది. ఇది భారతీయ సినిమా హిస్టరీలో సంచలనం విజయంగా నమోదైంది. ఏకంగా పెట్టిన పెట్టుబడికి 14 రెట్లు వసూలు చేయడం సంచలనమే అయింది. ఈ సినిమా గురించి పరిశ్రం చాలా ఎక్కువగా ముచ్చటించింది. ఇంతకీ ఏ సినిమా? అంటే .. వివరాల్లోకి వెళ్లాలి.
పరిశ్రమలో తక్కువ లేదా మీడియం-బడ్జెట్ చిత్రాలలో కొన్ని ఉత్తమమైన చిత్రాలను బాలీవుడ్ అందిస్తుందని పదే పదే రుజువైంది. ఎంపిక చేసుకున్న కథాంశం నుండి నటీనటుల నటన వరకు ప్రతిదీ చర్చల్లో నిలిచాయి. స్త్రీ, కహానీ వంటి చిత్రాలు మాస్‌లో భారీ విజయాన్ని సాధించాయి. అదే విధంగా ఆయుష్మాన్ ఖురానా-నటించిన 'అంధాధున్' యూనిక్ కథాంశం, నటీనటుల అద్భుత ప్రదర్శన కారణంగా బాక్సాఫీస్ వద్ద అసాధారణ విజయం సాధించింది.
శ్రద్ధా కపూర్ - రాజ్‌కుమార్ రావ్ నటించిన స్త్రీ, విద్యాబాలన్ నటించిన కహానీ వంటి సినిమాలు ప్రేక్షకులను తమ మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్‌తో సీట్ ఎడ్జుకు జారిపోయేలా చేసాయి. ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడిగా నటించిన అంధాధున్ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ కావడంతో ప్రేక్షకులు అంతే ఎగ్జయిట్ అయ్యారు. ఈ మీడియం బడ్జెట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
2018లో వచ్చిన ఈ సినిమా కేవలం రూ.32 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. అంధాధున్ ఒక కొత్త కథను తెరపై ఆవిష్కరించింది. ఇది ప్రేక్షకులను చివరి వరకు సస్పెన్స్ లో ఉంచే కథాంశం. ఊహించని మలుపులతో పాటు రొమాన్స్ సస్పెన్స్ ఈ సినిమాని టాప్ క్లాస్ మేకింగ్ లో నిలబెట్టాయి. నెక్ట్స్ సీన్ లో ఏం జరుగుతుందో ముందే ఊహిస్తే అది తప్పు అని మలుపు తిప్పేయడం ఈ సినిమా స్క్రీన్ ప్లేలో ప్రధాన ఆకర్షణ. థియేటర్లలో ప్రేక్షకుల అంచనాలన్నీ తప్పుగా మారతాయి. దానివల్ల ఉత్కంఠగా వీక్షిస్తాడు.
ఇది ఒక అంధుడి కథ. టైటిల్ పాత్రను ఆయుష్మాన్ పోషించాడు. అతడు రెస్టారెంట్‌లో జీవనోపాధి కోసం పియానో వాయించేవాడు. ఒక ధనవంతుడు హత్యకు గురైనప్పుడు, అనుమానం ఆకాష్ సర్రాఫ్ (ఆయుష్మాన్ పాత్ర) వైపు వెళుతుంది. కానీ అతను అంధుడు. కాబట్టి తర్వాత ఏమి జరుగుతుంది అనేది ఉత్కంఠ కలిగిస్తుంది. ఆకాష్ నిర్దోషినా కాదా? అన్నదానికి సినిమా చూసిన తర్వాత మాత్రమే సమాధానం కనుగొనగలము. అంధాధున్‌కి దర్శకత్వంతో పాటు రచయితగాను శ్రీరామ్ రాఘవన్ తనదైన ముద్ర వేసారు.
ఈ చిత్రం 5 అక్టోబర్ 2018న విడుదలైంది. యుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే, మరియు అనిల్ ధావన్ తదితరులు నటించారు. వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ - మ్యాచ్‌బాక్స్ పిక్చర్స్ బ్యానర్‌లపై సుధాన్షు వాట్స్, అజిత్ అంధరే, గౌరవ్ నందా, అశోక్ వసోడియా, కేవల్ గార్గ్, సంజయ్ రౌత్రే దీనిని నిర్మించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 456 కోట్లకు పైగా వసూలు చేసి 2018లో అత్యధిక వసూళ్లు రాబట్టిన నాల్గవ భారతీయ చిత్రంగా నిలిచింది. దాదాపు బడ్జెట్ కి 13 రెట్లు అదనంగా బాక్సాఫీస్ వసూళ్లు దక్కాయి.