కోలీవుడ్ లో ప్రశాంత్ చేస్తున్నాడు.. ఏమవుతుంది?
కోలీవుడ్ లో ప్రశాంత్ ఇదే సినిమాను రీమేక్ చేస్తున్నాడు.. ఇంతకీ ఏమవుతుంది?
చాలా కాలంగా కోలీవుడ్ స్టార్ హీరో ప్రశాంత్ నటించిన సినిమా రాలేదు. అతడు వినయ విధేయ రామ(2019) చిత్రంలో నటించాడు. ఇప్పుడు 'అంధగన్' సినిమాతో అభిమానుల ముందుకు రానున్నాడు. తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రం బాలీవుడ్ బ్లాక్ బస్టర్ కాబిల్ కి రీమేక్. బాలీవుడ్ లో కాబిల్ బంపర్ హిట్టు. హృతిక్ రోషన్ కీలక పాత్రను పోషించాడు. అదే చిత్రాన్ని టాలీవుడ్ లో నితిన్ చేసాడు.. కానీ అది ఫ్లాప్ అయింది. కోలీవుడ్ లో ప్రశాంత్ ఇదే సినిమాను రీమేక్ చేస్తున్నాడు.. ఇంతకీ ఏమవుతుంది?
ప్రశాంత్, సిమ్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం 'అంధగన్' చిత్రీకరణ ఇప్పటికే ఆలస్యమైంది. చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీ రిలీజ్ తేదీని నిర్ణయించారు. ఇప్పుడు చిత్ర బృందం చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ థ్రిల్లర్ డ్రామాకి సంబంధించిన మొదటి అధికారిక ట్రైలర్‌ను జూలై 13న విడుదల చేసారు.
అంధగన్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా - టబు ప్రధాన పాత్రల్లో నటించిన అంధాధున్ (2018)కి తమిళ రీమేక్. తమిళ రీమేక్‌లో ప్రశాంత్, సిమ్రాన్ ఇద్దరు ప్రధాన పాత్రలు పోషించారు. ఒరిజినల్ లో రాధికా ఆప్టే చేసిన పాత్రలో ప్రియా ఆనంద్ నటిస్తోంది. అంధగన్కి ప్రశాంత్ తండ్రి , దర్శకుడు త్యాగరాజన్ దర్శకత్వం వహించారు. స్టార్ మూవీస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో కార్తీక్, సముద్రఖని, ఊర్వశి, యోగి బాబు, వనిత విజయకుమార్ తదితరులు నటించారు. సినిమా టెక్నికల్ క్రూలో సినిమాటోగ్రాఫర్ రవి యాదవ్, ఎడిటర్ సతీష్ సూర్య, మ్యూజిక్ కంపోజర్ సంతోష్ నారాయణన్ ఉన్నారు.
అంధాధున్ చిత్రాన్ని తెలుగులో నితిన్, తమన్నా, నభా నటేష్ ప్రధాన పాత్రధారులుగా 'మాస్ట్రో' పేరుతో రీమేక్ చేసారు. కానీ ఇది ఇక్కడ అంతగా వర్కవుటవ్వలేదు. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కథానాయకుడిగా భ్రమమ్ అనే టైటిల్ తో రూపొందింది. తమిళ వెర్షన్ రకరకాల కారణాలతో అనేక జాప్యాలను ఎదుర్కొంటోంది. సినిమా విడుదలకు సంబంధించి ఖచ్చితమైన విడుదల తేదీని ఇంకా ప్రకటించనప్పటికీ త్వరలో విడుదల ఖాయమని ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు.
తదుపరి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ది గోట్ (విజయ్ హీరో)లో ప్రశాంత్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రమోషన్లలో ప్రశాంత్ ప్రముఖంగా కనిపిస్తున్నాడు.