మలైకా తండ్రి మృతిపై పోస్టు మార్టం రిపోర్ట్!
బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి అనీల్ ఆరోరా బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే
బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి అనీల్ ఆరోరా బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన మృతికి గాను బాలీవుడ్ సెలబ్రిటీలంతా సంతాపం తెలిపారు. సన్నిహితులు, కుటుం సభ్యుల సమక్షంలో గురువారం అనీల్ అరోరా అంత్యక్రియల ఘట్టం కూడా ముగిసింది. అయితే తాజాగా అనిల్ అరోరా ప్రాథమిక శవపరీక్ష నివేదిక వెల్లడైంది. ఇందులో అనిల్ తలకు, కాళ్ళుకు,చేతులకు ఇతర భాగాలకు అనేక గాయాలైనట్లు రిపోర్టులో ఉంది.
ఈ విషయాన్ని పోలీసులు మీడియా ముఖంగా వెల్లించారు. ఆరు అంతస్తుల భవనం నుంచి దూకడంతో శరీరంలో అన్ని భాగాలు దెబ్బతిన్నట్లు పోలీసులు ధృవీకరించారు. ఆత్మహత్య నేపత్యంలో పోలీసులు కుటుంబ సభ్యులు, ఇతర సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసారు. ప్రాథమిక నివేదికలో ఆత్మహత్యతో మరణించినట్లు పేర్కొన్నప్పటికీ, అనీల్ మరణానికి సంబంధించిన పరిస్థితులపై తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసు అధికారలు వెల్లడించారు.
ముంబై పోలీసులు మలైకా అరోరా, ఆమె సోదరి అమృతా అరోరా , తల్లి జాయిస్ వాంగ్మూలాలను నమోదు చేశారు. అలాగే అనీల్ కి శవ పరీక్ష నిర్వహించిన వైద్యుడితో పాటు అతనితో సన్నిహితంగా ఉన్న ఇతర కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌ను కూడా నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు కూడా విచారణ జరుపుతున్నాయని పోలీస్ ఉన్నత అధికారులు తెలిపారు.
కేసును అన్ని కోణాల్లోనూ విచారించిన తర్వాత..అన్ని ఆధారాలు పక్కాగా సేకరించిన తర్వాతనే క్లోజ్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఆత్మహత్య అనే ప్రాధమికంగా నిర్దారణ అయింది. కుటుంబ సభ్యులు ఇంకే కోణంలోనే అనీల్ మరణంపై ఎలాంటి ఆరోపణలు చేయని సంగతి తెలిసిందే.