చిరూ కోసం వైజాగ్ పార్క్ హోటల్ లో అనిల్ మకాం
రాజమౌళి తర్వాత టాలీవుడ్ లో ఫ్లాప్ లేని డైరెక్టర్ గా అనిల్ రావిపూడి పేరు సంపాదించుకున్నాడు.;
రాజమౌళి తర్వాత టాలీవుడ్ లో ఫ్లాప్ లేని డైరెక్టర్ గా అనిల్ రావిపూడి పేరు సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్లే. కమర్షియల్ డైరెక్టర్ గా సక్సెస్ అయిన అనిల్ రావిపూడి ప్రతీ సినిమా కథను మొదలుపెట్టే ముందు ఓ విషయాన్ని సెంటిమెంట్ గా భావిస్తాడట.
తన ప్రతీ సినిమా స్క్రిప్ట్ ను అనిల్ వైజాగ్ లోనే రాసుకుంటాడట. తనకు వైజాగ్ కు ఎంతో అనుబంధముందని, అందుకే ప్రతీ కథ కోసం వైజాగ్ లోనే మకాం వేస్తానని చెప్పిన అనిల్, స్క్రిప్ట్ పూర్తయ్యాక సింహాచలం అప్పన్న స్వామి, సంపత్ వినాయక స్వామి దగ్గర స్క్రిప్ట్ పెట్టి పూజ చేయించి వారి ఆశీస్సులతోనే సినిమాను మొదలుపెడతానని గతంలో చాలా సార్లు చెప్పాడు.
ఇప్పటివరకు తాను తీసిన ప్రతీ సినిమా స్క్రిప్ట్ వైజాగ్ లోనే పుట్టిందని, ప్రతీ సినిమా తనకు బ్లాక్ బస్టర్ ను అందించి తనని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ని చేసిందని చెప్పిన అనిల్ ఇప్పుడు మరోసారి వైజాగ్ లో మకాం వేశాడు. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ తర్వాత అనిల్, మెగాస్టార్ చిరంజీవితో నెక్ట్స్ మూవీని చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే వైజాగ్ వెళ్లిన అనిల్ పార్క్ హోటల్ లో ఇవాళ్టి నుంచి మెగాస్టార్ సినిమా కోసం స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉండనున్నాడు. త్వరలోనే స్క్రిప్ట్ వర్క్ ను ఫినిష్ చేసి మూడు నాలుగు వారాల్లో చిరంజీవికి ఫైనల్ నెరేషన్ ఇవ్వనున్నట్టు అనిల్ ఆల్రెడీ చెప్పాడు. చిరంజీవితో తాను చేయబోయే సినిమా అందరి అంచనాలను అందుకునేలా ఉంటుందని అనిల్ చెప్పాడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఫోకస్ మొత్తం అనిల్ రావిపూడి పైనే ఉంది. ఇప్పటికే వెంకీ, బాలయ్యతో మంచి ఎంటర్టైనర్ మూవీస్ చేసిన అనిల్, చిరూ కామెడీ టైమింగ్ ను వాడుకుని ఎలాంటి కామెడీని పండిస్తాడో అని చూడ్డానికి అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను నెక్ట్స్ ఇయర్ సంక్రాంతి రిలీజ్ టార్గెట్ గా తెరకెక్కనుంది.