మెగా ఎంటర్టైనర్ కు రెడీ అవుతున్న అనిల్
భోళా శంకర్ సినిమా తర్వాత నుంచి చిరంజీవి సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.;
భోళా శంకర్ సినిమా తర్వాత నుంచి చిరంజీవి సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే చాలా గ్యాప్ తీసుకుని మరీ వశిష్టతో విశ్వంభరను మొదలుపెట్టాడు. ఈ సినిమా మొదలైనప్పుడు దీనిపై చాలా హైప్ ఉంది. కానీ టీజర్ రిలీజయ్యాక వీఎఫ్ఎక్స్ వల్ల ఆ బజ్ తగ్గిపోయింది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న విశ్వంభర సినిమా వీఎఫ్ఎక్స్ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. విశ్వంభర తర్వాత చిరూ ఇప్పటికే రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల చెప్పిన కథతో పాటూ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి కథకు కూడా చిరూ ఓకే చెప్పాడు.
ఈ రెండు సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ రెండింటిలో ముందుగా చిరూ అనిల్ తో కలిసి సినిమా చేయనున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేశాడు. అనిల్ రావిపూడి కూడా చిరూ కోసం ఫుల్ స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నట్టు చెప్పాడు. ఇదిలా ఉంటే అనిల్ రీసెంట్ గానే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
ఈ సినిమా 50 రోజుల థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుని ఆల్రెడీ టెలివిజన్, ఓటీటీలోకి కూడా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అనిల్ ఓ వైపు తన తర్వాతి సినిమాకు స్క్రిప్ట్ ను రెడీ చేస్తూ కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అనిల్ తన సోషల్ మీడియాలో తాను తన నెక్ట్స్ మెగా ఎంటర్టైనర్ కోసం రెడీ అవుతున్నానని, తనకు సపోర్ట్ చేసిన అందరికీ మరోసారి థ్యాంక్స్ అంటూ పోస్ట్ చేశాడు.
ఇన్‌సైడ్ టాక్ ప్రకారం అనిల్ ఈ సినిమాను చాలా తక్కువ టైమ్ లో పూర్తి చేయాలని చూస్తున్నాడట. వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అసలే అనిల్ రావిపూడి సినిమాల్లో నెక్ట్స్ లెవెల్ కామెడీ ఉంటుంది, దానికి చిరంజీవి కామెడీ టైమింగ్ తోడైతే అది ఏ రేంజ్ లో ఉంటుందో చూడ్డానికి మెగా ఫ్యాన్స్ తో పాటూ మూవీ లవర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.