టాలీవుడ్లో మరో యూనివర్శ్!
యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడికి ఇంతవరకూ ఫెయిల్యూర్ లేదు. చేసిన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి.
యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడికి ఇంతవరకూ ఫెయిల్యూర్ లేదు. చేసిన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి. నిర్మాతలకు కోట్లలో లాభాలు తెచ్చి పెట్టాయి. అనీల్ కి కలిసి వచ్చిన ఈ సెంటిమెంట్ జానర్ ని విడిచి పెట్టకుండా సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి ఎఫ్ -2 ప్రాంచైజీ. ఎఫ్ -2, ఎఫ్ -3 చిత్రాలు ఎలాంటి విజయం సాధించాయో తెలిసిందే. త్వరలో సంక్రాంతికి వస్తున్నాం అంటూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.
పండక్కి ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనీల్ కూడా ఓ యూనివర్శ్ ని తెరపైకి తెచ్చాడు. ఎఫ్-2 ప్రాంచైజీతో సంక్రాంతికకి వస్తన్నాం సినిమాల్ని కలిపి ఓ యూనివర్శ్ క్రియేట్ చేసే ఆలోచన పంచుకున్నాడు. సంక్రాంతి సినిమా రిలీజ్ అయితే కచ్చితంగా యూనివర్శ్ లోకి ఎంటర్ అవుతానని తెలిపాడు. ఇప్పటికే లోకేష్ కనగరాజ్ , ప్రశాంత్ వర్మలు తమ యూనివర్శ్ లను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే.
లోకేష్ ది క్రైమ్ యూనివర్శ్ అయితే? ప్రశాంత్ వర్మది భక్తి యూనివర్శ్! అనీల్ కూడా రెడీ అయితే ఇది కామెడీ యూనివర్శ్ అవుతుంది. ఇప్పటివరకూ అనీల్ తీసిన సినిమాల్లో యాక్షన్ ఉన్నా? అంతిమంగా కామన్ గా హైలైట్ అయింది కామెడీ మాత్రమే. ఎఫ్ -2 ప్రాంచైజీ అంత పెద్ద సక్సెస్ అయిందంటే కారణం కామెడీ. సంక్రాంతికి వస్తున్నాం కూడా పూర్తి కామెడీ చిత్రం. వెంకటేష్ లేడీ ఫాలోయింగ్ ని బేస్ చేసుకుని తీసిన చిత్రం.
అందుకే ఆ రెండు చిత్రాల నుంచి కలిపి ఓ యూనివర్శ్ గా క్రియేట్ చేసి మరిన్ని కొత్త సినిమాలు చేసే దిశగా అనీల్ ఆలోచన కనిపిస్తుంది. అయితే ఇది ప్రస్తుతానికి ఆలోచనగానే ఉంది. అనీల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితోనూ ఓ సినిమా చేయాల్సి ఉంది. సంక్రాంతికి వస్తున్నాం స్టోరీ చిరుతోనే తీయాలనుకున్నట్లు ప్రచారంలో ఉంది. కానీ చిరు కు రాసిన కథ వేరే ఉందని..అది ఇంకా పూర్తవ్వలేదని తెలిపారు.