నాగార్జున‌తో అనీల్ రావిపూడి 'హ‌లో బ్ర‌ద‌ర్'!

డైరెక్ట‌ర్ గా సీనియ‌ర్ హీరోలు బాల‌కృష్ణ‌, వెంక‌టేష్ ల‌ను డైరెక్ట్ చేసారు.

Update: 2025-01-23 06:02 GMT

యంగ్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కూ వైఫ‌ల్య‌మే ఎదుర‌వ్వ‌లేదు. ఇటీవ‌లే రిలీజ్ అయిన 'సంక్రాంతికి వ‌స్తున్నాం'తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ న‌మోదు చేసాడు. ఇది అనీల్ కెరీర్ లో భారీ వ‌సూళ్ల చిత్రంగా నిలిచింది. ఇప్ప‌టికే 200 కోట్ల‌కుపై వ‌సూళ్ల‌ను సాధించి రికార్డు సృష్టించింది. డైరెక్ట‌ర్ గా సీనియ‌ర్ హీరోలు బాల‌కృష్ణ‌, వెంక‌టేష్ ల‌ను డైరెక్ట్ చేసారు. ఇక సీరియర్ హీరోల్లో బ్యాలెన్స్ ఉంది మెగాస్టార్ చిరంజీవి- కింగ్ నాగార్జునే మాత్ర‌మే.

చిరంజీవితో కూడా ప్రాజెక్ట్ ఒకే అయిన‌ట్లు తెలుస్తోంది. ఆ సినిమా ఇదే ఏడాది ప్ట‌ట్టాలెక్కుతుంది. దీంతో నాగార్జున‌తో సినిమా ఎప్పుడు ఉంటుంద‌నే సందేహాలు ఇప్ప‌టికే వ్య‌క్త‌మయ్యాయి. సీనియ‌ర్లు ముగ్గురితోనూ ప‌నిచేసి కింగ్ ని వ‌దిలేస్తారా? అన్న సందేహం వ్య‌క్త‌మైంది. ఈ నేప‌థ్యంలో నాగార్జున‌తో అనీల్ ఏకంగా `హ‌లో బ్ర‌ద‌ర్` లాంటి సినిమానే ప్లాన్ చేస్తున్న‌ట్లు తాజాగా అనీల్ రివీల్ చేసాడు. కింగ్ తో చేస్తే అలాంటి సినిమా చేయాల‌ని ఉంద‌ని మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట పెట్టాడు.

నాలుగు మూల స్థంబాలు లాంటి క‌థానాయ‌కుల‌తో సినిమాలు చేసాన‌ని ఓ రికార్డు ఉంటుంది కాబ‌ట్టి ఏ హీరోని వ‌ద‌లను అని అన్నారు. నాగార్జున‌తో హ‌లో బ్ర‌ద‌ర్ సినిమా అన‌గానే అక్కినేని అభిమానుల్లో ఒక్క‌సారిగా జోష్ తో నిండిపోయింది. నాగార్జున కెరీర్ లో హ‌లో బ్ర‌ద‌ర్ ఓ ఐకానిక్ చిత్రం. ఈ వీవీ స‌త్య‌నారాయ‌ణ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో నాగార్జున ద్విపాత్రాభిన‌యంలో అల‌రించారు. రాజ్ కోటి సంగీతం అందించి మ్యూజిక‌ల్ హిట్ గాను నిలిపారు.

అనీల్ రావిపూడి ప్ర‌క‌ట‌న బ‌ట్టి హ‌లోబ్ర‌ద‌ర్ కి సీక్వెల్ చేసినా బాగుంటుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అనీల్ ఎంత బ‌ల‌మైన క‌థ‌లు రాసినా అందులో త‌న మార్క్ హిలేరియ‌స్ కామెడీ ఉంటుంది. హ‌లో బ్ర‌ద‌ర్ కి అలాంటి ట‌చ్ ఇచ్చి త‌న‌దైన మార్క్ ట్రీట్ మెంట్ ఇచ్చాడంటే? తిరుగుండ‌దు.

Tags:    

Similar News