అప్పుడు వెంకీ చేసిందే ఇప్పుడు చిరూ చేయ‌బోతున్నాడా?

సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాతో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ ను అందుకున్న స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి త‌న త‌ర్వాతి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-04-01 16:30 GMT
అప్పుడు వెంకీ చేసిందే ఇప్పుడు చిరూ చేయ‌బోతున్నాడా?

సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాతో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ ను అందుకున్న స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి త‌న త‌ర్వాతి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఉగాది సంద‌ర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు కూడా జ‌రిగాయి. మెగాస్టార్ కెరీర్లో 157వ సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్ గా తెర‌కెక్కనుంది.

చిరూ టైమింగ్ కు అనిల్ కామెడీ తోడైతే థియేట‌ర్ల‌లో న‌వ్వులు పూయ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తూనే ఉంది. ఈ సినిమాలో చిరంజీవి త‌న అస‌లు పేరు శంక‌ర్ వ‌ర‌ప్ర‌సాద్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు వెల్ల‌డించిన అనిల్ రావిపూడి ఫ్యాన్స్ మెగాస్టార్ ను ఎలా చూడాల‌నుకుంటున్నారో త‌న సినిమాలో ఆయ‌న్ని అలానే చూపించ‌నున్న‌ట్టు చెప్పి సినిమాపై అంచ‌నాల్ని భారీగా పెంచేశాడు.

ఇదిలా ఉంటే సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమా స‌క్సెస్ లో కీల‌క పాత్ర పోషించిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ సిసిరోలియోనే మెగా157కు కూడా సంగీతం అందించ‌నున్నాడు. ఇవాళ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన స్పెష‌ల్ వీడియో ద్వారా ఈ విష‌యం అధికారికంగా వెల్ల‌డైంది. ఈ వీడియోలో చిరంజీవి కూడా గోదారి గ‌ట్టు మీద రామ సిల‌క‌వే లాంటి సాంగ్స్ ఇవ్వాల‌న్న‌ట్టు సంకేత‌మిస్తూ భీమ్స్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఇదిలా ఉంటే మెగా157 మ్యూజిక్ గురించి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఓ అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మొత్తం ఐదు పాట‌లుంటాయ‌ని, అందులో మూడు పాట‌లకు సంబంధించిన ట్యూన్స్ ఆల్రెడీ లాక్ అయిపోయాయ‌ని, మ‌రో రెండు ట్యూన్స్ ను ఫైన‌ల్ చేయాల్సి ఉంద‌ని తెలుస్తోంది. అంతేకాదు, మెగా157 మ్యూజిక్ విష‌యంలో మ‌రో క్రేజీ న్యూస్ కూడా తెలుస్తోంది.

సంక్రాంతికి వ‌స్తున్నాంలో ఎలాగైతే వెంక‌టేష్ తో సాంగ్ పాడించి సినిమాకు మంచి హైప్ ను తీసుకొచ్చారో ఇప్పుడు మెగా157లో కూడా అలానే మెగాస్టార్ చిరంజీవితో ఓ సాంగ్ ను రికార్డ్ చేయాల‌ని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. అదే నిజ‌మైతే మెగా157కు స్పెష‌ల్ క్రేజ్ తోడైన‌ట్టే. ఇదిలా ఉంటే ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ ఎంట‌ర్టైన్మెంట్స్, గోల్డ్ బాక్స్ ఎంట‌ర్టైన్మెంట్ బ్యాన‌ర్ల‌పై సాహు గార‌పాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News