ఒక్క సినిమా ప్లాప్ అయినా పాతాళానికే!
అయితే ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చిన తర్వాత ఓ ఫెయిల్యూర్ ఎదురైతే డైరెక్టర్ పరిస్థితి ఎలా ఉంటుందన్నది వివరించాడు.
యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి గురించి పరిచయం అసవరం లేదు. ఇంత వరకూ వైఫల్యమే లేకుండా సినిమాలు చేసిన డైరెక్టర్. 'పటాస్', 'సుప్రీమ్',' రాజాది గ్రేట్',' ఎఫ్ -2' ప్రాంచైజీ, 'సరిలేరు నీకెవ్వరు',' భగవంత్ కేసరి' ఇలా వరుస విజయాలే ఆయన ఖాతాలో ఉన్నాయి. ఇలా కమర్శియల్ చిత్రాలతో హిట్ అందుకోవడం నేటి జనరేషన్ దర్శకుల్లో అనీల్ కే చెల్లింది. సీనియర్ హీరోలంతా అతడితో నటించడానికి ఆసక్తి చూపిస్తుంటారు.
ఇప్పటికే వెంకటేష్, బాలకృష్ణకు మంచి విజయాలు అందించాడు. మళ్లీ వెంకటేష్ తో 'సంక్రాంతి వస్తున్నాం' అనే మరో సినిమా కూడా చేసారు. సక్రాంతి కానుకగా ఆ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది. అయితే ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చిన తర్వాత ఓ ఫెయిల్యూర్ ఎదురైతే డైరెక్టర్ పరిస్థితి ఎలా ఉంటుందన్నది వివరించాడు. 'వరుస విజయాలు ఎన్ని వచ్చినా? ఒక్క ప్లాప్ ఎదురైంది అంటే ఆ డైరెక్టర్ పాతాళానికి పడిపోవాల్సిందే.
ఆ డైరెక్టర్ వైపు హీరో, నిర్మాతలు చూసే పరిస్థితి ఉండదన్నారు. అప్పటి వరకు రాసుకుపూసుకుని తిరుగిన వారు కూడా ముఖం చాటేస్తారు. ఇక్కడ హిట్లు ఉంటేనే అవకాశాలు ఉంటాయి. లేదంటే? దుకాణం సర్దుకుని వెళ్లి పోవా ల్సిందే. ఇండస్ట్రీలో ఏ రోజు ఎలా ఉంటుందో కూడా చెప్పలేం. ఇది సెక్యూర్ లైఫ్ కాదు. ఫాంలో ఉన్నంత కాలం సినిమాలు చేసుకుంటూ వెళ్లడమే. అది పోయిన తర్వాత అవకాశాలు రాలేదన బాధపడకూడదు' అన్నారు.
నిజమే ఒకప్పుడు శ్రీనువైట్ల, వి. వినాయక్ ఇండస్ట్రీకి ఎలాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారో తెలిసిందే. నేడు వాళ్లకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. శ్రీనువైట్ల అప్పుడప్పుడు అయినా కనిపిస్తున్నారు. కానీ వినాయక్ మాత్రం కనిపించలేదు. అనీల్ రావిపూడి మాత్రం ఎంతో జాగ్రత్తగా సిసనిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. స్టోరీల విషయంలో సాహసాలకు పోకుండా కమర్శియల్ గా సినిమాని ఎలా సక్సెస్ చేయాలో? చేసుకుంటూ వెళ్తున్నాడు. అందుకే ఇండస్ట్రీలో నిలబడ్డాడు.