చిన్నోడు-పెద్దోడు కోసం అనీల్ స్టోరీ!
అప్పటి వరకూ టాలీవుడ్ లో సోలో చిత్రాలు చూసిన అభిమానులకు మల్టీస్టారర్ చిత్రాలు కొత్త అనుభవాన్ని పంచాయి.
నేటి జనరేషన్ హీరోల్లో మల్టీస్టారర్ చిత్రాలకు పునాది వేసింది వెంకటేష్-మహేష్ అని చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` సినిమాలో అన్నదమ్ములుగా నటించిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల తెరకె క్కించిన ఆ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. ఆ తర్వాత మరిన్ని మల్టీస్టారర్ చిత్రాలు తెరపైకి వచ్చాయి. అప్పటి వరకూ టాలీవుడ్ లో సోలో చిత్రాలు చూసిన అభిమానులకు మల్టీస్టారర్ చిత్రాలు కొత్త అనుభవాన్ని పంచాయి.
ఇండస్ట్రీలో హీరోల మద్య సఖ్యతను మల్టీస్టారర్ చిత్రాలు మరింత బలంగా మార్చాయి. సీనియర్ హీరోలు తమ జూనియర్లతో కలిసి నటించడం? స్టార్ హీరోల చిత్రాల్లో గెస్ట్ రోల్స్ పోషించడం ఈ ట్రెండ్ అంతటికి పునాది వేసింది వెంకీ-మహేష్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అలాంటి సూపర్ హిట్ కాంబినేషన్ మళ్లీ చేతులు కలపలేదు. వెంకటేష్ ఇతర హీరోలతో కలిసి సినిమాలు చేస్తున్నారు గానీ మహేష్ తో మాత్రం సెకెండ్ అటెంప్ట్ చేయలేదు.
ఈ నేపథ్యంలో ఆ ఛాన్స్ యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడికి ఉందని తెలుస్తోంది. `సంక్రాంతికి వస్తున్నాం` సక్సెస్ అయిన నేపథ్యంలో వెంకీ ఇంట్లో జరిగిన సక్సెస్ పార్టీకి మహేష్ ఫ్యామిలీతో హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీమ్ అందరితో మహేష్ ఇంటరాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో అనీల్, మహేష్-వెంకీతో ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడనే డిస్కషన్ కూడా జరిగినట్లు సన్నిహితుల నుంచి లీకైంది. అదే జరిగితే? మరో హిట్ బొమ్మతో ఇండస్ట్రీనే షేక్ చేస్తాడు అనీల్.
ఫ్యామిలీ-హిలేరియస్ ఎంటర్ టైనర్లు చేయడం అనీల్ కి కొట్టిన పిండి. సంక్రాంతి సినిమా వసూళ్లు చూస్తుంటే? సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అర్దమవుతుంది. మహేష్ కూడా ఇలాంటి కంటెంట్ ని ప్రోత్సహించడంలో ముందుంటారు. అన్ని రకాల జనార్ సినిమాలు చేయాలన్నది మహేష్ కోరిక. ఈ నేపథ్యంలో అనీల్ తో ఇప్పటికే `సరిలేరు నీకెవ్వరు` చేసారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక వెంకీతో అనీల్ బాండింగ్ ఎంతో ప్రత్యేకమైనది. కాబట్టి మహేష్ -వెంకీలను కలపడం అనీల్ కి పెద్ద పనేం కాదు. అయితే అందుకు ఓ మూడేళ్లు అయినా సమయం పడుతుంది. ప్రస్తుతం మహేష్ ఫోకస్ అంతా రాజమౌళి సినిమాపైనే ఉంది.