మెగాస్టార్ ఖాతాలో 500 + కోట్లు లాంఛనమేనా?
కేవలం రీజనల్ మార్కెట్ తోనే ఈ రేంజ్ లో వసూళ్లు సాధించడం అన్నది వెకంటేష్- అనీల్ కి మాత్రమే సాధ్యమైంది.
వందకోట్లు వసూళ్లు లేని విక్టరీ వెంకటేష్ ని అనీల్ రావిపూడి ఏకంగా 300 కోట్ల క్లబ్ లో కూర్చోబెట్టాడు. ఇటీవల ఆ కాంబినేషన్ లో రిలీజ్ అయిన `సంక్రాంతికి వస్తున్నాం` ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. దీంతో టీమ్ అంతా ఎంతో సంతోషంగా సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటుంది. కేవలం రీజనల్ మార్కెట్ తోనే ఈ రేంజ్ లో వసూళ్లు సాధించడం అన్నది వెకంటేష్- అనీల్ కి మాత్రమే సాధ్యమైంది.
ఇదేమీ పాన్ ఇండియా రిలీజ్ చిత్రం కాదు. అమెరికా సహా దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే పరిమితంగా రిలీజ్ అయింది. తెలుగులో భారీ ఎత్తున విడుదలైంది. ఆ మార్కెట్ ఫరిదిలోనే 300 కోట్లు కొల్లగొట్టింది. తెలుగు హీరోల్లో ఇదో గొప్ప రికార్డు అని చెప్పాలి. అయితే ఇప్పుడు అదే అనీల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేస్తున్నాడు. వేసవిలో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ టార్గెట్ ఎంత అంటే? 500 కోట్లు పైనే అని చెప్పాలి.
ఎందుకంటే మెగాస్టార్ భారీ ఇమేజ్ ఉన్న నటుడు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్నటుడు. ఆయన సినిమాలకు భారీ ఎత్తున ఓపెనింగ్స్ దక్కుతాయి. ప్లాప్ టాక్ తె చ్చుకున్నా? పెట్టిన బడ్జెట్ లో సగానికి పైగా ఈజీగా తేగలదు. మరి అలాంటి నటుడితో అనీల్ సినిమా అంటే 500 కోట్లకు పైగానే థియేట్రికల్ వసూళ్లగా రాబట్టాలి. మెగా ఇమేజ్ తో ప్రీ రిలీజ్ బిజినెస్ పెద్ద విషయం కాదు.
కానీ బాక్సాఫీస్ పోరులోనే మెగాస్టార్ నెగ్గాలి. అప్పుడే మెగా ఇమేజ్ కి పరి పూర్ణ సార్దకత దక్కతుంది. ఇది అనీల్ మార్క్ చిత్రం. చిరంజీవి ఎంతో ఇష్టపడి చేస్తోన్న పక్కా కామెడీ ఎంటర్ టైనర్ అని చెప్పేసారు. కాబట్టి ఇందులో కొత్తదనం ఆశించకుండా చూడాల్సిన సినిమా అని జనాలకు అర్దమైపోయింది. అయితే ఈ కథని అనీల్ ఎగ్జిక్యూట్ చేసే విధానం.. ప్రేక్షకులకు చిరంజీవి కనెక్ట్ అయ్యే విధానాన్ని బట్టే బాక్సాఫీస్ లెక్క ఆధారపడి ఉంటుంది.