పొలిమేర డైరెక్టర్ సూసైడ్ థాట్స్!
బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన `పొలిమేర2` తో దర్శకుడు అనీల్ విశ్వనాధ్ పేరు టాలీవుడ్ లో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.;

బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన `పొలిమేర2` తో దర్శకుడు అనీల్ విశ్వనాధ్ పేరు టాలీవుడ్ లో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా రిలీజ్ అయిన `పొలిమేర` అప్పట్లో మంచి ప్రయత్నంగా నిలించింది. కాన్సెప్ట్ కి మంచి రివ్యూలు రావడంతో? `పొలిమేర2` చేసి బ్లాక్ బస్టర్ అందు కున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా భారీ విజయం సాధించడంతో? `పొలిమేర` చరిత్రను తవ్వే ప్రయత్నాలు జోరుగా సాగాయి.
ఈ క్రమంలోనే యూట్యూబ్ లో రెండవ భాగం రిలీజ్ తర్వాత `పొలిమేర`కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే `పొలిమేర 3` కూడా ప్రకటించారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. స్క్రిప్ట్ పనులు పూర్తి చేసి రిలీజ్ చేయడానికి కొంచెం సమయం పడుతుంది. ఈ గ్యాప్ లో అనీల్ విశ్వనాధ్ `28 డిగ్రీస్` అనే సినిమా తెరకెక్కించాడు. ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా రూపొందించాడు. నవీన్ చంద్ర, షాలినిజంటగా నటించారు.
ఈ సినిమా ప్రచారంలో భాగంగా అనీల్ విశ్వనాద్ తన ఇండస్ట్రీ కష్టాల గురించి చెప్పుకొచ్చే ప్రయత్నం చేసాడు. `దర్శకుడిగా ఇదే నా తొలి చిత్రం. `పొలిమేర` కంటే ముందు మొదలు పెట్టాను. 2017 లో మొదలు పెట్టాను. 2020 లో రిలీజ్ చేద్దామనుకుంటే కరోనా వచ్చింది. దీంతో ఎన్నో సవాళ్లు ఎదుర య్యాయి. ఈ అనుభవంతోనే ఓ పుస్తకం రాసాను. సాధారణంగా మొదడు దెబ్బ తిన్నవాళ్లు ఎక్కువ వేడి, చల్లదనాన్ని తట్టుకోలేరు.
ఆ థియరీ ఆధారంగా 28 డిగ్రీస్ స్టోరీ రాసాను. సినిమా మొదలై మధ్యలో ఆగిపోయిన తర్వాత ఆర్దికంగా చాలా ఇబ్బందులు పడ్డాను. ఎందుకంటే ఇందులో నేను పెట్టుబడులు పెట్టాను. ఏం చేయాలో తెలియక టెన్షన్ పడేవాడిని. ఆయోమయానికి గురయ్యాను. మనసులో సూసైడ్ ఆలోచనలు కలిగాయి. చనిపోతే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయనుకున్నాను. కానీ చనిపోయి సాధించడం కంటే బ్రతికి సాధిద్దా మని `పొలిమేర` మొదలు పెట్టాను. అటుపై `పొలిమేర2` తో అన్నింటిని అధిగమించాను` అన్నారు.