క్రేజీ మూవీకి షాక్ ఇచ్చిన స్టార్‌ నటుడు

బాలీవుడ్‌ కి ఈ మధ్య కాలంలో గడ్డు కాలం నడుస్తుంది. స్టార్‌ హీరోల సినిమాల్లో ఎక్కువ శాతం బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి

Update: 2024-05-19 10:30 GMT

బాలీవుడ్‌ కి ఈ మధ్య కాలంలో గడ్డు కాలం నడుస్తుంది. స్టార్‌ హీరోల సినిమాల్లో ఎక్కువ శాతం బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. దాంతో ఫిల్మ్‌ మేకర్స్ భారీ బడ్జెట్‌ సినిమాలు అంటేనే భయపడుతున్నారు. గతంలో స్టార్‌ కాస్ట్‌ ను బట్టి బడ్జెట్‌ పెడితే ఖచ్చితంగా రివకరీ ఉండేది. కానీ ఇప్పుడు రికవరీ శాతం చాలా తక్కువ అయ్యింది.

ఎంత పెద్ద స్టార్‌ హీరో అయినా సినిమాకు నెగిటివ్‌ టాక్ వచ్చింది అంటే కనీసం 25 శాతం కూడా బడ్జెట్‌ రికవరీ అవ్వడం లేదు. అందుకే బాలీవుడ్‌ నిర్మాతలు కాస్ట్‌ కట్టింగ్‌ పేరుతో నటీ నటుల పారితోషికం విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా బాలీవుడ్‌ క్రేజీ మూవీ హౌస్‌ఫుల్‌ 5 విషయంలో అదే జరిగింది. అక్షయ్‌ కుమార్‌, కత్రీనా కైఫ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో పలువురు స్టార్స్ ను ముఖ్య పాత్రల్లో నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనీల్ కపూర్‌ ను కీలక పాత్ర కోసం సంప్రదించడం, ఆయన కమిట్‌ అవ్వడం జరిగింది.

షూటింగ్ కి వెళ్లాల్సిన సమయంలో అనూహ్యంగా ఈ సినిమా నుంచి అనిల్ కపూర్ తప్పుకున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. పారితోషికం విషయంలో నిర్మాతలతో అనిల్ కపూర్ కి విభేదాలు వచ్చాయని, అందుకే అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసి సినిమా నుంచి తప్పుకున్నాడు అంటూ బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

హౌస్‌ఫుల్‌ 5 కి మంచి క్రేజ్ ఉంది. అలాంటి క్రేజీ మూవీ లో అనిల్‌ కపూర్ వంటి స్టార్‌ నటుడు నటిస్తే ఖచ్చితంగా మంచి హైప్ ఉంటుంది. కానీ ఆయన తప్పుకోవడం ఇప్పుడు సినిమాకు కచ్చితంగా కొంత అయినా డ్యామేజ్ క్రియేట్‌ చేసే విషయం అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సాజిద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్‌ అతి త్వరలోనే మరింత వేగంగా జరుగబోతుంది. అనిల్ కపూర్‌ స్థానంను బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాం పాల్ తో రీప్లేస్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అన్ని వివరాలతో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News