మహేష్ చెప్పిన తర్వాత చిరంజీవి సినిమా సెట్స్ కి!
కానీ 'భోళా శంకర్' సినిమా చేస్తున్నప్పుడు మహేష్ ఓ మాట చెప్పారు. ఓ హీరోగా చెబుతున్నా.ప్రతీ రోజు మీరు సెట్స్ కి వెళ్లండి. సెట్స్ లో నే ఉండాలి.
ఏ.కె ఎంటర్ టైన్ మెంట్స్ అధినేతల్లో ఒకరైన అనీల్ సుంకర కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోలందరితో ఎన్నో హిట్ సినిమాలు నిర్మించి పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. 'భోళా శంకర్' సినిమాతో ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా అనీల్ సుంకర కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
సాధారణంగా ఆయన ఏ హీరోతో సినిమా నిర్మించిన సినిమా సెట్స్ కి వెళ్లరుట. అప్పుడప్పుడు వెళ్లి కనిపించి వచ్చేస్తారుట. భారమంతా దర్శకులపైనే వేసి..తన పనుల్లో తాను బిజీగా ఉంటారుట. అయితే సూపర్ స్టార్ మహేష్ తో సినిమా నిర్మిస్తే గనుక తప్పకుండా రెగ్యులర్ గా సెట్స్ కివెళ్తారుట. ఆయన తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా అలా రెగ్యులర్ గా వెళ్తానని తాజా ఇంటర్వ్యూలో తెలిపారు.
కానీ 'భోళా శంకర్' సినిమా చేస్తున్నప్పుడు మహేష్ ఓ మాట చెప్పారు. ఓ హీరోగా చెబుతున్నా. ప్రతీ రోజు మీరు సెట్స్ కి వెళ్లండి. సెట్స్ లో నే ఉండాలి. నిర్మాత సెట్లో ఉంటే చిరంజీవి గారు ఆనందపడతారు.
ఆ మాట తర్వాత రోజు సెట్స్ కి వెళ్లడం ప్రారంభించా. నిజంగా ఇది మరుపు రాని ప్రయాణం. ఒక రోజు కూడా వృద్దా కాలేదు అన్న అభిప్రాయం కలగింది. చిరంజీవి సినిమాలో లీనమయ్యే విధానం గొప్పగా ఉంటుంది.
నిర్మాణ వ్యయం నియంత్రించడంలో ఆయనకున్న స్పష్టత ఎవరికీ ఉండదనిపిస్తుంది. వీలైనంత వరకూ వ్యయం తగ్గించాలనే ప్రయత్నిస్తా. కానీ అది అనుకున్నంత తేలిక కాదు. నాకే కాదు ప్రతీ నిర్మాతకు ఇది సవాల్ తో కూడుకున్న పనే. 'ఏజెంట్' అనుభవంతో బాగా అర్దమైంది.
ఆ సినిమా తర్వాత నుంచి అన్ని సినిమాలు అన్నీ పక్కాగా ఉంటేనే సెట్స్ కి వెళ్లాలని డిసైడ్ అయ్యాను' అని అన్నారు. అలాగే మహేష్ సలహాతో అనీల్ సుకంరలో మార్పు వచ్చింది. ఏ నిర్మాత అయినా సెట్స్ లో ఉంటేనే ఖర్చు అదుపులో ఉంటుంది. లేదంటే? నమ్మి మిగతా వారిపై పెడితే అది తడిపి మోపుడ వుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.