బాలయ్య బ్రాండ్ గట్టిగా వాడుతున్న అనిల్
ఇక టీజర్ నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్ వరకు కూడా బాలయ్య బాబు బ్రాండ్ అయితే అతను గట్టిగా మార్కెట్లో వాడుతున్నట్లుగా తెలుస్తోంది.
దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా మేకింగ్ విధానంతోనే కాకుండా ప్రమోషన్ విషయంలో కూడా చాలా కొత్తగా ఆలోచిస్తూ ఉంటాడు. అతను చేసే సినిమాలు రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లోనే అయినా కూడా సినిమా జనాల దృష్టిని ఆకట్టుకునేలా తెలివిగా అడుగులు వేస్తూ ఉంటాడు. ఇక బాలయ్య బాబుతో సినిమా చేస్తున్నాడు అనగానే ఫ్యాన్స్ లో వైబ్స్ క్రియేట్ అయ్యాయి.
తప్పకుండా అతను అంచనాలకు తగ్గట్టుగానే సినిమా చేస్తాడు అని అందరూ అనుకున్నారు. ఇక టీజర్ నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్ వరకు కూడా బాలయ్య బాబు బ్రాండ్ అయితే అతను గట్టిగా మార్కెట్లో వాడుతున్నట్లుగా తెలుస్తోంది. కమర్షియల్ ఫార్మాట్లో మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలను అందించడంలో అనిల్ రావిపూడి సిద్ధహస్తుడు.
ఇక బాలయ్య బాబుతో అతనికి ఒకవైపు ఎమోషనల్ మరొకవైపు మాస్, కామెడీ యాంగిల్స్ లో మెప్పించే అవకాశం అయితే వచ్చింది. ఇక ట్రైలర్ చూసిన తర్వాత ఆ విషయంలో చాలా క్లారిటీ వచ్చేసింది. బాలయ్య బాబు ఇందులో సీరియస్ డైలాగ్స్ తో పాటు ఫన్నీగా విలన్స్ ను ఒక ఆట ఆడుకోవడం కూడా హైలెట్ అవుతుంది అని అనిపిస్తోంది. ఇక తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పిన విధానం కూడా క్లిక్ అయ్యే అవకాశం ఉంది.
అయితే ఈ సినిమాలో అతని పాత్ర పేరు నేలకొండ భగవంత్ కేసరి. అంటే షార్ట్ ఫామ్ లో NBK. నందమూరి బాలకృష్ణ NBK ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు అదే మీనింగ్ తో ఉండేలా సినిమాలో అలా పేరు పెట్టడం ఫ్యాన్స్ కు మరింత ఆనందం కలిగిస్తోంది.
ఎన్.బి.కె బ్రాండ్ ను అనిల్ రావిపూడి ఏ రేంజ్ లో వాడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో శ్రీలీల ఒక స్పెషల్ బాండింగ్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతోంది. అలాగే కాజల్ అగర్వాల్ బాలయ్యకు జోడిగా నటించబోతోంది. ఈ దసరాకు మాత్రం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా మిగతా సినిమాలకు గట్టి పోటీని ఇవ్వగలదు.