అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే సంగీత దర్శకుడు ఎవరు?

ఈ ప్రాసెస్ లో సంగీతం కూడా చాలా కీలకం అయ్యింది. కథని ప్రేక్షకులకి బాగా రీచ్ చెయ్యాలంటే మ్యూజిక్ కూడా చాలా ముఖ్యం.

Update: 2024-12-08 11:34 GMT

ప్రస్తుతం సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. ఒక భాషలో తీసిన సినిమాని అవకాశాన్ని బట్టి వీలైనన్ని భాషలలో రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీ ఛానల్స్ వచ్చిన తర్వాత వీలైనంత ఎక్కువ మందికి కంటెంట్ ని రీచ్ చేయడం కోసం మేకర్స్ తో పాటు ఓటీటీ ఛానల్స్ కూడా ఈ పద్ధతిని ఫాలో అవుతున్నాయి. పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ చేసిన తర్వాత సినిమాలకి మార్కెట్ పరిధి పెరిగింది. సినిమాకి ఎక్కువ వేల్యూ వచ్చింది.

అన్ని భాషలలో  ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే యూనివర్శల్ కథలతోనే చిన్న హీరోల నుంచి స్టార్స్ వరకు అందరూ మూవీస్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ లో సంగీతం కూడా చాలా కీలకం అయ్యింది. కథని ప్రేక్షకులకి బాగా రీచ్ చెయ్యాలంటే మ్యూజిక్ కూడా చాలా ముఖ్యం. అదిరిపోయే ఎలివేషన్స్ తో అన్ని వర్గాల ఆడియన్స్ కి రీచ్ అయ్యే విధంగా మ్యూజిక్ అందించే సంగీత దర్శకులకి డిమాండ్ పెరిగింది. ఇలా డిమాండ్ పెరిగిన మ్యూజిక్ డైరెక్టర్స్ లో అనిరుద్ రవిచందర్ టాప్ లో ఉన్నాడు.

తమిళంలో స్టార్ హీరోలందరి సినిమాలకి మేగ్జిమమ్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తెలుగులో కూడా ‘దేవర’ మూవీ సక్సెస్ తో అనిరుద్ కి డిమాండ్ పెరిగింది. ‘జైలర్’, ‘లియో’ లాంటి సినిమాలు అతని మ్యూజిక్ కారణంగానే సూపర్ హిట్ అయ్యాయనే టాక్ ఉంది. దీంతో అనిరుద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలని ఎక్కువ మంది మేకర్స్ ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతని రెమ్యునరేషన్ కూడా పెరిగింది.

ఇండియాలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏఆర్ రెహమాన్ ఒకప్పుడు హైయెస్ట్ పెయిడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండేవారు. అతను సినిమాకి 10 కోట్ల వరకు తీసుకుంటారు. అయితే అనిరుద్ ఇప్పుడు 15 కోట్లకి పైగా రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ‘దేవర 1’ తర్వాత అనిరుద్ తన రెమ్యునరేషన్ ని మరింతగా పెంచినట్లు టాక్ వినిపిస్తోంది.

ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ ఇప్పుడు దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా అతని నుంచి వచ్చే సాంగ్స్ వెంటనే సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతున్నాయి. ప్రేక్షకులకి బాగా రీచ్ రావడంతో పాటు మూవీపైన ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి. అందుకే మేకర్స్ కూడా అనిరుద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. షారుఖ్ కి ‘జవాన్’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత బాలీవుడ్ లో కూడా అతనికి క్రేజ్ పెరిగిపోయింది.

Tags:    

Similar News