రెమ్యునరేషన్ లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్

అతని మ్యూజిక్ ఉంటే సినిమాకి అదనపు అడ్వాంటేజ్ ఉంటుందని మేకర్స్ సైతం భావిస్తున్నారు.

Update: 2024-10-18 04:27 GMT

సౌత్ ఇండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఇప్పుడు మంచి జోరు మీద ఉన్నాడు. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. మేగ్జిమమ్ స్టార్ హీరోలతోనే అనిరుద్ మూవీస్ ఉండటం విశేషం. కోలీవుడ్ లో అయితే టైర్ 1 హీరోలు అందరికి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ ఫస్ట్ ఛాయస్ అయిపోయాడు. అతని మ్యూజిక్ ఉంటే సినిమాకి అదనపు అడ్వాంటేజ్ ఉంటుందని మేకర్స్ సైతం భావిస్తున్నారు. ఇక తెలుగులో కూడా అనిరుద్ మెల్లగా గేర్ మారుస్తున్నాడు.

అతనికి ఛాన్స్ లు పెరుగుతున్నాయి రీసెంట్ గా ‘దేవర’ మూవీతో మ్యూజికల్ సక్సెస్ ని అనిరుద్ అందుకున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రెండు సినిమాలకి వర్క్ చేస్తున్నారు. అందులో ‘మ్యాజిక్’ అనే చిన్న సినిమా ఒకటి ఉండగా విజయ్ దేవరకొండతో చేస్తోన్న ‘VD 12’ మూవీ మరొకటిగా ఉంది. అలాగే నేచురల్ స్టార్ నానితో ఇప్పటికే ‘గ్యాంగ్ లీడర్’, ‘జెర్సీ’ సినిమాలకి అనిరుద్ వర్క్ చేశాడు. శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ ఫిక్స్ అయ్యారు. దీంతో పాటు ‘దేవర 2’ లైన్ లో ఉంది.

కోలీవుడ్ లో రజినీకాంత్ ‘కూలి’, ‘విజయ్ 69’ మూవీ, అజిత్ ‘విడామయార్చి’ మూవీస్ ఉన్నాయి. హిందీలో షారుఖ్ ఖాన్ ‘కింగ్’ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇలా పాన్ ఇండియా హీరోల సినిమాలకి అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేయడంతో అతను రెమ్యునరేషన్ కూడా ఎక్కువగానే తీసుకుంటున్నాడు. భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ కోసం 12 కోట్ల వరకు అనిరుద్ వసూళ్లు చేస్తున్నాడంట.

మినిమమ్ బడ్జెట్ మూవీస్ కోసం 10 కోట్లు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. రెమ్యునరేషన్ విషయంలో అనిరుద్ రెహమాన్ ని దాటేశాడు. రెహమాన్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేస్తోన్న ‘RC 16’ కోసం 10 కోట్లు తీసుకుంటున్నాడు. మేగ్జిమమ్ పెద్ద సినిమాలకి మాత్రమే రెహమాన్ వర్క్ చేస్తాడు. ఇక రెమ్యునరేషన్ పరంగా మూడో స్థానంలో దేవిశ్రీ ప్రసాద్ 8 కోట్లతో ఉన్నాడు.

అనిరుద్ మూవీస్ లైన్ అప్ చూసుకుంటే ఇలా ఉంది.

రజినీకాంత్ కూలీ

ఎన్టీఆర్ దేవర 2

కమల్ హాసన్ ఇండియన్ 3

కెవిన్ మూవీ

షారుఖ్ ఖాన్ కింగ్

ప్రదీప్ రంగనాథ్ ఎల్ఐకె

గౌతమ్ తిన్ననూరి మ్యాజిక్

నాని ఓదేల2

SKARM

దళపతి 69

VD 12

విడామయార్చి

Tags:    

Similar News