అనిరుధ్.. హిట్ కాంబో మిస్సయ్యిందా?

అయితే, నాని క్రేజ్, శ్రీకాంత్ ఓదెల ప్రతిభతో ఈ సినిమా మరో హిట్ గా నిలుస్తుందని నిర్మాతలు నమ్మకంతో భారీగా నిర్మిస్తున్నారు.

Update: 2024-12-11 14:30 GMT

రాక్‌స్టార్ అనిరుధ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యంత క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అలాంటి అనిరుధ్, నాని నటిస్తున్న 'ది ప్యారడైజ్' సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేయనున్నట్లు ముందుగా ప్రకటించారు. 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, అనిరుధ్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు సమాచారం.

అనిరుధ్ బిజీ షెడ్యూల్ కారణంగా 'ది ప్యారడైజ్'కు సమయం కేటాయించలేకపోతున్నారని తెలుస్తోంది. నాని కోరిక మేరకు ఈ ప్రాజెక్ట్‌కు ఒప్పుకున్న అనిరుధ్, తన ప్రస్తుత కమిట్‌మెంట్స్‌ వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. అనిరుధ్ కేటాయించిన సమయం మరియు డేట్స్ క్లాష్ అవుతుండటంతో, ఈ ప్రాజెక్ట్‌కు అతను దూరమైనట్లు టాక్.

ఈ నేపథ్యంలో, చిత్ర బృందం అనిరుధ్‌కు ప్రత్యామ్నాయంగా మరో సంగీత దర్శకుడి కోసం వెతుకులాట ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్‌కి సంగీతం ఎంత కీలకమో తెలుసుకున్న నిర్మాతలు, అనిరుధ్ స్థాయికి తగ్గ మరొక సంగీత దర్శకుడిని ఫైనల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. అలాగే అనిరుధ్ స్థానంలో వచ్చే సంగీత దర్శకుడి పేరు కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

'ది ప్యారడైజ్' యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. ప్రముఖ నటులు మోహన్ బాబు, రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో వారి పాత్రలు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.

నాని 'హిట్ 3' పూర్తి చేసిన తరువాత ఈ సినిమా షూటింగ్, ప్రారంభమవుతుందని చిత్రబృందం ప్రకటించింది. శైలేష్ కొలను దర్శకత్వంలో 'హిట్ 3' సినిమా పూర్తి చేసే వరకు నాని మరో ప్రాజెక్ట్ చేయకూడదని ఫిక్స్ అయ్యాడు. 'ది ప్యారడైజ్' కోసం కూడా నాని స్పెషల్ ప్రిపరేషన్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందుకే కన్ఫ్యూజన్ లేకుండా ఆ సినిమా కోసం స్పెషల్ గా సిద్ధం కానున్నాడు.

ఇక అనిరుధ్ తప్పుకోవడం ఈ ప్రాజెక్ట్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. అయితే, నాని క్రేజ్, శ్రీకాంత్ ఓదెల ప్రతిభతో ఈ సినిమా మరో హిట్ గా నిలుస్తుందని నిర్మాతలు నమ్మకంతో భారీగా నిర్మిస్తున్నారు. త్వరలోనే కొత్త సంగీత దర్శకుడి పేరు అధికారికంగా ఒక అప్డేట్ తో క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి నాని - శ్రీకాంత్ ప్రాజెక్ట్ ను అందుకునే ఆ లక్కీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కాలమే సమాధానం ఇవ్వాలి.

Tags:    

Similar News