అనిరుధ్.. ఈసారి తేడా కొట్టింది

కోలీవుడ్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న అనిరుద్ వరుస సక్సెస్ లు అందుకుంటూ జోరుమీదున్నాడు.

Update: 2024-10-16 05:08 GMT

కోలీవుడ్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న అనిరుద్ వరుస సక్సెస్ లు అందుకుంటూ జోరుమీదున్నాడు. పాన్ ఇండియా సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో కథకి ప్రాణం పోస్తూ ప్రేక్షకులకి మరింత గ్రాండ్ గా కంటెంట్ రీచ్ చేస్తున్నాడు. గత ఏడాది రిలీజ్ అయిన ‘జైలర్’, ‘లియో’, ‘జవాన్’ సినిమాల సక్సెస్ లలో అనిరుద్ మ్యూజిక్ కూడా ఒక కీ రోల్ పోషించింది.

ఇక ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘దేవర’ కి కూడా అనిరుద్ మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యింది. సినిమాకి మిక్స్డ్ రివ్యూలు వచ్చిన కూడా ఇప్పటి వరకు ఈ చిత్రం 500 కోట్లకి పైగా కలెక్షన్స్ సొంతం చేసుకొని థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఇప్పటికే కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా మారిన ఈ బొమ్మ లాంగ్ రన్ లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలనే ఆసక్తి అందరిలో ఉంది.

ఇదిలా ఉంటే అనిరుద్ సినిమా మ్యూజిక్ అంతా కంప్లీట్ అయ్యాక అవుట్ ఫుట్ చూసుకొని ఒక ట్వీట్ చేస్తూ ఉంటాడు. సినిమా హిట్ అవుతుందని అనిపిస్తే బ్లాక్ మాస్టర్ బొమ్మ అనే సింబాలిక్ ట్వీట్ చేస్తాడు. అలా ట్వీట్ చేసాడంటే సినిమా సక్సెస్ గ్యారెంటీ అనే అభిప్రాయం ఇండస్ట్రీతో పాటు పబ్లిక్ లో కూడా ఉంది. ‘దేవర’ మూవీ సక్సెస్ తర్వాత సుమ ఇంటర్వ్యూలో కొరటాల సైతం ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘జైలర్’, ‘లియో’, ‘జవాన్’, ‘దేవర’ సినిమాల విషయంలో అనిరుద్ ప్రెడిక్షన్ నిజం అయ్యింది.

ఈ సినిమాలు కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం ‘వేట్టయన్’ కి కూడా అనిరుద్ బ్లాక్ బస్టర్ అని చెబుతూ తన స్టైల్ లో ట్వీట్ చేశాడు. అయితే ఈ మూవీ రిజల్ట్ మాత్రం తేడా కొట్టింది. మొదటి రోజే మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న ‘వేట్టయన్’ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి బిలో యావరేజ్ గా నిలిచింది. ఈ మూవీ కలెక్షన్స్ కూడా పూర్తిగా డ్రాప్ అయిపోయాయి. ‘జైలర్’ లాంటి సక్సెస్ తర్వాత మరల ఆ రేంజ్ మూవీని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేశారు.

దర్శకుడు టీజే జ్ఞాన్ వేల్ మాత్రం పూర్తిగా ప్రేక్షకులని నిరాశపరిచాడు. జై భీమ్ తరహాలో పూర్తిగా సోషల్ కాన్సెప్ట్ తో రియలిస్టిక్ గా కథని చెప్పలేదు. అలా అని పూర్తిగా రజినీకాంత్ ఇమేజ్ కి సరిపోయే మాస్ అండ్ కమర్షియల్ ఎలివేషన్స్ తో కూడా మూవీ చేయలేదు. మధ్యరకంగా ఉండటంతో ఆడియన్స్ ఈ సినిమా విషయంలో పూర్తిగా డిజపాయింట్ అయ్యారు. ఈ ప్రభావం కలెక్షన్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి సారిగా ‘వేట్టయన్’ మూవీ విషయంలో అనిరుద్ అంచనాలు తప్పాయనే మాట ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

Tags:    

Similar News