దేవర.. అనిరుధ్ తో వచ్చిన సమస్యేంటీ?
కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ తెలుగులో ప్రస్తుతం దేవర మూవీ చేస్తున్నారు.
కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ తెలుగులో ప్రస్తుతం దేవర మూవీ చేస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్ లో కొరటాల శివ డిజైన్ చేస్తున్నారు. ఈ సినిమాకి యూనివర్శల్ గా అందరికి రీచ్ అయ్యే మ్యూజిక్ కావాలని కొరటాల శివ ఏరికోరి అనిరుద్ ని ఎంపిక చేసుకున్నారు. తెలుగులో అనిరుద్ వర్క్ చేసిన సినిమాలు ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్ గా పెద్దగా హిట్ కాలేదు. అయిన కూడా అనిరుద్ టాలెంట్ మీద నమ్మకంతో దేవర కోసం ఎంపిక చేశారు.
రీసెంట్ గా దేవర మూవీ టైటిల్ సాంగ్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఈ సాంగ్ కి సూపర్ గా ఉందనే టాక్ అయితే రాలేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బాగానే కనెక్ట్ అయ్యింది. మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. చిత్ర యూనిట్ సాంగ్స్ కోసం వెయిట్ చేస్తుందంట. అనిరుద్ తమిళ్ సినిమాలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ దేవర సినిమా సాంగ్స్ ని ఆలస్యం చేస్తున్నాడనే టాక్ వైరల్ అవుతోంది. గతంలో అనిరుద్ తెలుగు సినిమాలు చేసే సమయంలో చాలా ఎక్కువ జాప్యం చేస్తాడనే ఆరోపణలు వచ్చాయి.
అలాగే కోలీవుడ్ సినిమాలకి ఇచ్చినంత బెస్ట్ మ్యూజిక్ తెలుగు చిత్రాలకి అనిరుద్ ఇవ్వడని విమర్శలు కూడా ఉన్నాయి. దేవర మూవీ విషయంలో కూడా అనిరుద్ అదే పాత వైఖరిని అవలంబిస్తున్నాడనే కొత్త టాక్ మళ్ళీ వైరల్ అవుతోంది. నిజానికి జూన్ లోనే దేవర మూవీ సాంగ్ కోసం ట్యూన్ ఇవ్వాల్సి ఉందంట. అయితే ఇప్పటి వరకు అతను ట్యూన్ కంపోజ్ చేసి ఇవ్వలేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో అనిరుద్ ఇచ్చే ట్యూన్ కోసం లిరిక్ రైటర్ వెయిట్ చేస్తున్నాడంట.
నిజానికి సెకండ్ సింగిల్ ని కూడా వీలైనంత వేగంగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. అనిరుద్ ట్యూన్ ఇవ్వకపోవడం వలన ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. అనిరుద్ ఇండియన్ 2 సినిమాకి మ్యూజిక్ అందించారు. అయితే ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ని మ్యూజిక్ పరంగా రీచ్ అవడంలో అనిరుద్ ఫెయిల్ అయ్యాడనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. తమిళంలో అరడజను సినిమాల వరకు అతని చేతిలో ఉన్నాయి.
దీంతో దేవరకి ప్రయారిటీ తగ్గించి తమిళ్ సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడనే మాట వినిపిస్తోంది. అనిరుద్ విధానంతో దేవర మూవీకి అనవసరమైన తలనొప్పి కొత్తగా మొదలైందనే ప్రచారం టాలీవుడ్ సర్కిల్ లో నడుస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. దేవర సినిమాకు అనిరుద్ బెస్ట్ మ్యూజిక్ అందించకపోతే మాత్రం టాలీవుడ్ లో మళ్ళీ పెద్ద సినిమాల అవకాశాలు కాస్త తగ్గే అవకాశం లేకపోలేదు.