రిక్షా వాడు ఫ్యాంటు విప్పాడు.. టైలర్ మీద చెయ్యేశాడు
దివంగత యువకథానాయకుడు ఉదయ్ కిరణ్ సరసన `నువ్వు నేను` లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించింది అనితా హసనందానీ.
దివంగత యువకథానాయకుడు ఉదయ్ కిరణ్ సరసన `నువ్వు నేను` లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించింది అనితా హసనందానీ. బుల్లితెర నటిగా పాపులరైన ఈ బ్యూటీని టాలీవుడ్ డైరెక్టర్ తేజ ఆడిషన్స్ లో ఎంపిక చేసుకున్నాడు. అనిత బ్లాక్ బస్టర్ డెబ్యూ తర్వాత ఉదయ్ కిరణ్ తోనే `శ్రీరామ్` అనే మరో హిట్ చిత్రంలోను నటించింది. అటుపైనా పలు తెలుగు చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. అయితే కొంతకాలానికి అవకాశాలు తగ్గాక తిరిగి తనకు అపరిమితంగా అవకాశాలు ఇచ్చిన బుల్లితెర వైపే వెళ్లిపోయింది. పాపులర్ నిర్మాత, బాలాజీ టెలీ ఫిలింస్ అధినేత్రి ఏక్తాకపూర్ కి అనిత అత్యంత సన్నిహితురాలు.
ఇక అనిత బుల్లితెరపై బిజీగా ఉండగానే, ఒక వ్యాపారవేత్తను పెళ్లాడింది. ఈ జంటకు పిల్లలు ఉన్నారు. ఇక
అనితా హసనందానీ తల్లి అయిన తర్వాత కూడా బుల్లితెరకు తిరిగి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి భయంకర ఎపిసోడ్‌లను గుర్తుచేసుకుంది. ఒక రిక్షా డ్రైవర్ అశ్లీలంగా సిగ్నల్ ఇస్తూ.. తనను, తన స్నేహితులను పాఠశాలలో ఉన్నప్పుడు వేధించాడని పేర్కొంది.
పాపులర్ మీడియాతో ఇంటరాక్షన్‌లో అనితా హసనందాని మాట్లాడుతూ ఇలా అన్నారు. ``మేం స్కూల్ లో ఉన్నప్పుడు.. మా అమ్మ మాకు రూ.10 ఇచ్చేది. రిక్షాలో వెళ్లి తిరిగి వచ్చేందుకు ఆ డబ్బు. కానీ మేం నడిచి ఇంటికి తిరిగి వచ్చేవాళ్లం.. కాబట్టి మేము సమోసా లేదా ఏదైనా తినడం ద్వారా ఆ డబ్బులోంచి కొంత ఆదా చేసేవాళ్ళం. క్యాంటీన్ కి వెళితే అక్కడ రిక్షా వ్యక్తి ఉండేవాడు. అతడు ఎప్పుడూ అక్కడే ఉండేవాడు. కొంతమంది అమ్మాయిలను చూసినప్పుడల్లా అతడు తన ప్యాంటు జిప్ తెరిచి ఉంచేవాడు. నన్ను తాకేవాడు. మమ్మల్ని అదే పనిగా చూసేవాడు. ఆ వ్యక్తిని చూసి భయపడి మేం వెళ్లే మార్గాన్ని మార్చుకున్నాం.. అని అనిత చెప్పింది. ఆ తర్వాత కూడా రిక్షా కనబడితే చాలు మేం ఆందోళన చెందేవాళ్లం.. ఎందుకంటే రిక్షా పుల్లర్ తమను వెంబడిస్తాడని భయపడుతూ ఉండేవాళ్లం అని తెలిపారు.
తన దుస్తులకు కొలతలు తీసుకునే సమయంలో ఒక టైలర్ తనను పట్టుకున్న మరో సంఘటనను కూడా అనిత వివరించింది. దర్జీకి అరవై ఏళ్లు పైనే ఉన్నాయని కూడా వెల్లడించింది. కెరీర్ మ్యాటర్‌కి వస్తే... ఇటీవల టెలివిజన్ షో `హమ్ రహెం నా రహెన్ హమ్`లో కనిపించింది. విలన్ దేవికా మిట్టల్‌గా తిరిగి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. దివ్యాంక త్రిపాఠి, కరణ్ పటేల్‌లతో కలిసి నటించిన `యే హై మొహబ్బతేన్` డ్రామాతోను రక్తి కట్టిస్తోంది.