ట్రెడిషినల్ డ్రెస్సులో అంజలి హై గ్లామర్ డోస్

ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా అంజలి లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు, ఆమె అందం, డ్రెస్ స్టైల్ గురించి మరోసారి చర్చకు దారితీశాయి.

Update: 2025-01-15 06:31 GMT

తెలుగు, తమిళ చిత్రాలలో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అంజలి, కెరీర్ ఆరంభం నుంచే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తమిళం నుంచి వచ్చిన ఆమె, 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. సహజమైన అభినయం, అర్థవంతమైన పాత్రలతో అంజలి అనేకమంది అభిమానుల మనసు దోచుకుంది. కమర్షియల్ చిత్రాలు, కంటెంట్ బేస్డ్ సినిమాల్లోనూ విజయవంతంగా నడిచిన ఆమె, 'గీతాంజలి' వంటి చిత్రాలతో తన ప్రతిభను మరోసారి నిరూపించుకుంది.

 

ఇటీవల 'గేమ్ ఛేంజర్,' 'గాంగ్స్ ఆఫ్ గోదావరి' వంటి చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ, అంజలి తన కెరీర్‌లో మరో మెట్టు ఎక్కింది. వెబ్ సిరీస్‌లలో కూడా తన నటనతో అభిమానులను సంపాదించుకుంటూ, నటిగా తన పరిధిని విస్తరించుకుంది. ప్రతి పాత్రలో కూడా కొత్తదనాన్ని కనబరుస్తూ, కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, కథానాయికగా తన సత్తా చాటుతుంది.

 

 

ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా అంజలి లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు, ఆమె అందం, డ్రెస్ స్టైల్ గురించి మరోసారి చర్చకు దారితీశాయి. అంజలి ధరించిన తెల్లటి లెహంగాలో హస్తకళా అందాలు పుష్పించేలా ఉన్న ఈ ఫోటోలు, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మల్టీ కలర్ ఫ్లోరల్ డిజైన్, సింపుల్ జ్యూయెలరీతో ఆమె వేసుకున్న స్టైల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

 

లైట్ మేకప్, సాదాసీదా ఆభరణాలతో అంజలి, సంప్రదాయాన్ని గ్లామర్‌తో మేళవించినట్టు కనిపించింది. ఈ ఫోటోల్లో ఆమె లుక్స్, డ్రెస్‌లో ఉన్న డిజైన్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫోటోలపై అభిమానుల ప్రశంసల వర్షం కురుస్తోంది. అంజలి ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులలో నటిస్తోంది. తమిళంలో ఒక బిగ్ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుండగా మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. పలు వెబ్ సిరీస్ ప్రాజెక్టులపైనా దృష్టి సారించిన అంజలి, విభిన్నమైన పాత్రల ద్వారా మరింత పేరు సంపాదించేందుకు సిద్ధంగా ఉంది.

Tags:    

Similar News