మెస్మరైజింగ్ లుక్స్ తో కట్టిపడేస్తోన్న అంకిత

తరువాత బ్రేక్ అప్ చెప్పుకొని విడిపోయారు. 2019లో కంగనా రనౌత్ ‘మణికర్ణిక’ సినిమాతో ఆమె సినిమా తెరంగేట్రం చేసింది.

Update: 2024-10-27 04:42 GMT

హిందీలో ‘పవిత్ర రిస్తా’ సీరియల్ తో బాగా పాపులర్ అయిన అందాల భామ అంకిత లోఖడే. 2009 నుంచి 2014 వరకు ప్రసారం అయిన ఈ సీరియల్ ద్వారా హైయెస్ట్ పెయిడ్ టెలివిజన్ యాక్టర్ గా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ఈ సీరియల్ లో తనకి జోడీగా నటించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో ఆమె లివింగ్ రిలేషన్ లో చాలా కాలం ఉంది. తరువాత బ్రేక్ అప్ చెప్పుకొని విడిపోయారు. 2019లో కంగనా రనౌత్ ‘మణికర్ణిక’ సినిమాతో ఆమె సినిమా తెరంగేట్రం చేసింది.

తరువాత ‘బాఘీ 3’ మూవీలో ఆమె నటించింది. ఈ ఏడాది రిలీజ్ అయిన స్వాతంత్య్ర ‘వీర్ సవార్కర్’ మూవీలో కూడా హీరోయిన్ గా నటించింది. సవార్కర్ భార్యగా ఈ సినిమాలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో అంకిత లోఖడే కనిపించింది. 2023-2024 బిగ్ బాస్ హిందీ సీజన్ 17లో కూడా ఈమె పార్టిసిపేట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘ఆమ్రపాలి’ వెబ్ సిరీస్ లో టైటిల్ రోల్ పోషిస్తుంది. పీరియాడిక్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది.

ఇదిలా ఉంటే అంకిత లోఖడే 2021లో ప్రముఖ వ్యాపారవేత్త వికాస్ జైన్ ని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత నటిగా ఆమె మరింత బిజీ అయ్యింది. సోషల్ మీడియాలో కూడా అంకిత చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోషూట్ లని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తాయి. ఆమెకి 5.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ బ్యూటీ మాల్దీవ్స్ లో వెకేషన్ కి వెళ్లి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలలో అంకిత బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ ధరించి కళ్ళజోడు పెట్టుకొని స్టైలిష్ గా ఫోటోలకి ఫోజులిస్తుంది. ఈ ఫోటోలలో అంకిత చాలా గ్లామరస్ గా ఉందనే మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News