అన్న‌పూర్ణ స్టూడియోకి అందుకే దూరంగా ఉన్నా! వెంక‌ట్

ఏఎన్నార్ పెద్ద కుమారుడు వెంక‌ట్ గురించి చాలా త‌క్కువ మందికే. నిర్మాత‌గా ప‌లు సినిమాలు ప‌నిచేసి న‌ప్ప‌టికీ ఆయ‌న ఏనాడు కెమారా ముందుకు వ‌చ్చింది లేదు.

Update: 2023-11-13 12:30 GMT

ఏఎన్నార్ పెద్ద కుమారుడు వెంక‌ట్ గురించి చాలా త‌క్కువ మందికే తెలుసు. నిర్మాత‌గా ప‌లు సినిమాలు ప‌నిచేసి న‌ప్ప‌టికీ ఆయ‌న ఏనాడు కెమారా ముందుకు వ‌చ్చింది లేదు. ఆయ‌నెప్పుడు బిజినెస్ పనుల్లో బిజీగా ఉంటారు. చాలా కాలం క్రితం అన్న‌పూర్ణ స్టూడియోస్ బాధ్య‌త‌ల‌న్నీ ఆయన చూసుకొనే వారు అని అంటారు. పెద్దగా బయట కార్యక్రమాలకి కూడా తక్కువ గా వస్తూ ఉంటారు అని అంటారు . దీంతో వెంక‌ట్ గురించి పెద్ద‌గా ఎవరికీ తెలియ‌దు. అయితే ఎప్పటి నుంచో అన్న‌పూర్ణ స్టూడియోస్ బాధ్య‌త‌లు అక్కినేని నాగార్జున చూసుకోవ‌డంతో? వెంక‌ట్ ఏమైన‌ట్లు? అని అక్కినేని అభిమానులు సినిమా ప్రేముకులు అంటూ ఉంటారు.

ఆస్తుల పంప‌కాల్లో ఏవైనా పొరపొచ్చాలు వ‌చ్చాయా? అని సందేహాలు సైతం వ్య‌క్తం అయ్యాయి. అయితే తాజాగా వాట‌న్నింటిపై వెంక‌ట్ క్లారిటీ ఇచ్చారు. నేను..నాగ్ ఇద్ద‌రం సినిమా వాతావ‌ర‌ణంలో పెర‌గ‌లేదు. ఇద్ద‌రికీ సినిమా గురించి పెద్ద‌గా తెలియ‌దు. నాన్న‌గారు సినిమాల‌కు దూరంగా ఉంచాల‌నే ఉద్దేశంతో దూరం పెట్టేవారు. సినిమా కార్య‌క్ర‌మాలేవి మాపై రుద్దేవారు కాదు.

అలా మా చ‌దువులు పూర్త‌యిన త‌ర్వాత మొద‌టి సారి నేనే నాన్న‌తో నాగార్జున తెరంగేట్రం గురించి మాట్లాడాను. హీరోగా చేద్దాం అని నేను అనేస‌రికి నాన్న వెంట‌నే ఒప్పుకున్నారు. నేను నిర్మాత అవ్వ‌డా నికి..నాగ్ హీరో అవ్వ‌డానికి నాన్న ద‌గ్గ‌ర‌కు భ‌య‌ప‌డుతూనే వెళ్లాను. కానీ నేను అలా అనే స‌రికి వెంట‌నే ఒప్పుకున్నారు. ఇది నాకు ఆశ్చ‌ర్యంగానే అనిపించింది.

ఆ త‌ర్వాత చాలా కాలం పాటు అన్న‌పూర్ణ స్టూడియోకి సంబంధించి అన్ని ప‌నులు నేను చూసుకున్నాను. త‌ర్వాత జ‌న‌రేష‌న్ కి గ్యాప్ వ‌స్తుంద‌ని నేను కావాల‌ని త‌ప్పుకున్నాను. సినిమా వ్య‌వ‌హ‌రాలు నాకు అంత‌గా తెలియ‌వు. వాటిపై నాగార్జునకు మంచి అవ‌గాహ‌న ఉంది. మా ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి విబేధాలు లేవు. ఎప్పుడూ మేము ట‌చ్ లోనే ఉంటాం. ఫోన్ లో మాట్లాడుకుంటాం. ఇప్పుడు స్టూడియో వ్య‌వ‌హ‌రాల‌న్నీ త‌నే చూసుకుంటున్నాడు` అని అన్నారు.

Tags:    

Similar News