పుష్ప 2 మరో నేషనల్ రికార్డు

దీనికి కారణం తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన కొన్ని సినిమాలే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Update: 2024-11-05 12:50 GMT

దక్షిణాది నుంచి పాన్ ఇండియా చిత్రాల సంఖ్య ఇప్పుడు భారీ స్థాయిలో పెరిగిపోయింది. దీనికి కారణం తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన కొన్ని సినిమాలే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా ఇండియా మొత్తం షేక్ చేసిన చిత్రాల్లో ‘పుష్ప ది రైజ్’ ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ రూపొందించిన ఈ చిత్రం.. పాన్ ఇండియా రేంజ్‌లో బిగ్గెస్ట్ హిట్‌ను సొంతం చేసుకుంది.

ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచిపోయేలా సంచలన విజయాన్ని అందుకున్న ‘పుష్ప ది రైజ్’ మూవీకి ఇప్పుడు సీక్వెల్‌ను కూడా తీస్తున్న విషయం తెలిసిందే. ‘పుష్ప ది రూల్’ పేరిట రాబోతున్న ఈ చిత్రంలో పుష్ప రాజ్ సాధారణ స్మగ్లర్ నుంచి ప్రధాన డాన్‌గా ఎలా మారాడు అన్న కథాంశాన్ని చూపించబోతున్నారు. దీంతో ఇది గతంలో కంటే మరింత హైప్‌తో రూపుదిద్దుకుంటోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ‘పుష్ప ది రూల్’ మూవీని డిసెంబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ఈ చిత్రం అప్పుడే హాట్ టాపిక్ అయిపోయింది. ముఖ్యంగా బుక్ మై షో వెబ్‌సైట్‌లో చాలా మంది ఈ చిత్రం కోసం ఆసక్తిని చూపిస్తున్నారు. ఇలా ‘పుష్ప 2’ దిమ్మతిరిగే రికార్డులను సొంతం చేసుకుంటోంది.

ఎన్నో అంచనాలు ఉన్న ‘పుష్ప ది రూల్’ సినిమాకు ఊహించని రీతిలో భారీ థియేట్రికల్ బిజినెస్ జరుగుతోంది. ముఖ్యంగా యూఎస్‌లో ఈ చిత్రాన్ని అత్యధిక స్క్రీన్లలో విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యూఎస్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ప్రత్యంగిర సినిమాస్ సంస్థ ‘పుష్ప 2’ సినిమా పోస్టర్లతో కూడిన లోగోలతో ప్రత్యేకంగా పాప్‌కార్న్ టబ్‌లు, సాఫ్ట్ డ్రింక్ క్యాన్స్‌ను తయారు చేయించింది. ఇలా ఇండియన్ సినిమా చరిత్రలో ఏ మూవీకి కూడా ఏర్పాట్లు జరగలేదు. ఈ విషయాన్ని సదరు సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

నార్త్ అమెరికాలో ‘పుష్ప ది రూల్’ సినిమా కోసం పాప్‌కార్న్ టబ్‌లు, సాఫ్ట్ డ్రింక్ క్యాన్స్‌ను ప్రత్యేకంగా చేయించడం ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. అదే సమయంలో చాలా మంది సినీ ప్రియులు పరాయి దేశంలో పుష్ప రాజ్ మేనియా ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి ఇదో నిదర్శనం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ ఈ న్యూస్‌ను, ఆ ఫొటోలను తెగ వైరల్ చేసుకుంటున్నారు.

Tags:    

Similar News