ప్రశాంత్ నీల్ మరో క్రేజీ మూవీ.. అప్పుడే టీజర్ ఆగయా
హోంబలే నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది శ్రీ మురళి హీరోగా నటిస్తున్నాడు.
కేజిఎఫ్, సలార్ వంటి సినిమాలతో కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్, అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ పేర్లు దేశవ్యాప్తంగా మారుమోగిపోయాయి. ఈ కాంబినేషన్ ప్రభాస్ తో రూపొందించిన 'సలార్' డిసెంబర్ 22న రిలీజ్ కాబోతోంది. ఇక దర్శకుడిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ మొదటిసారి కథ అందిస్తున్న చిత్రం 'భగీర'. హోంబలే నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది శ్రీ మురళి హీరోగా నటిస్తున్నాడు.
ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి కథ అందించడం వెనక ఓ బలమైన కారణం ఉంది. అది ఏంటంటే ఈ దర్శకుడి మొదటి సినిమా ఉగ్రం హీరో ఇతనే. ఉగ్రం వీళ్ళిద్దరికీ భారీ సక్సెస్ అందించింది. ఈ మూవీ తర్వాత వీరి కాంబినేషన్లో మరో సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ సలార్ వల్ల అది కుదరలేదు. ఒక దశలో శ్రీమురళిని KGF కోసం లుక్ టెస్ట్ కూడా చేశారు. కానీ అది కుదరకపోవడంతో యశ్ ని తీసుకోగా ఆ సినిమా అతన్ని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్ళింది.
అందుకే శ్రీ మురళి కోసం ప్రశాంత్ రెడీ చేసిన పవర్ ఫుల్ సబ్జెక్ట్ ని హోంబలే నిర్మాణ సంస్థలోనే రూపొందేలా చూసుకున్నాడు. కానీ ఈసారి దర్శకత్వ బాధ్యతలు మాత్రం కన్నడ డైరెక్టర్ సూరికి ఇచ్చారు. ఈరోజు టీజర్ ని లాంచ్ చేశారు. టీజర్ లో కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే టైటిల్ కనిపించింది. కానీ సినిమా పాన్ ఇండియా లెవెల్ లోనే రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. 'నగరమే అడవిగా మారి మనుషులు జంతువుగా మారినప్పుడు వాటిని వేటాడడం కోసం ఒకడు వస్తాడు. అతనే భగీర' అంటూ టీజర్ లో చూపించారు.
ఇందులో శ్రీ మురళి పవర్ఫుల్ పోలీస్ గా కనిపించడంతోపాటు మరో డిఫరెంట్ గెటప్ లో దర్శనమిచ్చాడు. టీజర్ లో విజువల్స్ చూస్తే ఇది కంప్లీట్ యాక్షన్ డ్రామా అని అర్థమవుతుంది. ఈసారి రవి బసూర్ కాకుండా విరూపాక్ష, మంగళవారం సినిమాలకు మ్యూజిక్ అందించిన అజనీష్ లోకనాథ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఇందులో శ్రీమురళి సరసన సాగరాలు దాటి హీరోయిన్ రుక్మిణి వసంత్ నటించడం మరో ప్లస్ పాయింట్.
ప్రకాష్ రాజ్, రంగనాయన రఘు, అచ్యుత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. KGF, సలార్ లతో పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ ని అమాంతం పెంచుకున్న హోంబలే ఫిలిమ్స్ నిర్మాతలకి భగీర ప్రమోషన్స్ విషయంలో పెద్దగా టెన్షన్ అవసరం లేదు. శ్రీమురళికి ఇతర భాషల్లో ఇమేజ్ లేకపోయినా ప్రశాంత్ నీల్ కథ, ప్రొడక్షన్ బ్యానర్.. ఈ రెండూ భగీర కి భారీ అండగా నిలవబోతున్నాయి.