అనూ ఇమ్మాన్యుయేల్ థ్రిల్లర్ మూవీ.. లండన్ లోనే మొత్తం..

అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఆమె ఎదుగుతుందని అందరూ భావించారు.

Update: 2024-10-24 02:29 GMT

అనూ ఇమ్మాన్యుయేల్.. నేచురల్ స్టార్ నాని మజ్ను మూవీతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అల్లుడు అదుర్స్, మహాసముద్రం, ఊర్వశివో రాక్షసివో వంటి పలు సినిమాల్లో నటించారు. అజ్ఞాత‌వాసి, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, శైల‌జ రెడ్డి అల్లుడు చిత్రాల్లోనూ యాక్ట్ చేశారు.


అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఆమె ఎదుగుతుందని అందరూ భావించారు. కానీ వరుస ఫ్లాపులతో డీలా పడిపోయారు. ఇక్కడ అవకాశాలు రాకపోయినా.. తమిళంలో మాత్రం సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు దాదాపు ఏడాది తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఓ థ్రిల్ల‌ర్ మూవీలో యాక్ట్ చేసున్నారు. హీరో శివ కందుకూరి సరసన న‌టిస్తున్నారు. తెలుగులో ఇప్పటికే మ‌నుచ‌రిత్ర‌, గ‌మ‌నం, భూత‌ద్ధం భాస్క‌ర్ నారాయ‌ణ‌తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో ఆయన హీరోగా క‌నిపించారు.

ఐదు భాషలలో 34 చిత్రాలకు డీవోపీగా పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు.. ఈ సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్, My3 ఆర్ట్స్ బ్యానర్లపై లండన్ గణేష్, డా. ప్రవీణ్ రెడ్డి వూట్ల నిర్మిస్తున్నారు. సితార ఫిల్మ్స్ లిమిటెడ్ లైన్ ప్రొడక్షన్‌ ను నిర్వహిస్తోంది. క‌ర్మ సిద్ధాంతం ఆధారంగా మూవీ రూపొందుతోందని మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. సినిమా షూటింగ్ మొత్తం లండ‌న్‌ లోనే జ‌రుగుతున్న‌ట్లు వెల్లడించారు.

లండన్ లోని బ్యూటిఫుల్ లొకేషన్స్ లో మూవీని షూట్ చేస్తున్నట్లు తెలిపారు. రెండు సమాంతర కథాంశాలతో ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్‌ గా రూపొందిస్తున్నట్లు మేకర్స్ చెప్పారు. మంచి ఎలిమెంట్స్ తో థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ను ఆడియన్స్ కు అందించాలని టార్గెట్ గా పెట్టుకున్నట్టు పేర్కొన్నారు. త్వరలో టైటిల్ ను రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

అయితే డైరెక్షన్‌ తో పాటు టెక్నికల్ ఎక్సలెన్స్‌ తో కూడుకున్న ఈ థ్రిల్లర్ మూవీకి ఆండ్రూ బాబు దర్శకత్వం వహిస్తూనే సినిమాటోగ్రఫీ కూడా నిర్వహిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్‌ ను పర్యవేక్షిస్తున్నారు. డీఆర్‌ కే కిరణ్ ఆర్ట్ డైరెక్టర్, రియల్ సతీష్ స్టంట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News