రతన్ టాటాలా లైఫ్ ని ప్లాన్ చేసిన సినీ నటుడు!
బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ గురించి చెప్పాల్సిన పనిలేదు వైవిథ్యమైన నటుడు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్న నటుడు.
ఫేమస్ అయిన సినిమా నటుల సంపాదన ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. నటులుగా సక్సెస్ అయితే కోట్ల రూపాయల ఆస్తులు కూడబెడతారు. వద్దన్నా డబ్బు వచ్చి పడుతుంది. అడ్వాన్సులు...పారితోషికం కాకుండా ఎండార్స్ మెంట్స్ చేస్తే అదనంగా మరో ఆదాయం సమకూరుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే అది రెట్టింపు అవుతుంది.
పాత తరం నటుల్లో కొంతమందైతే ఆర్దిక క్రమశిక్షణ లేకుండా ఉండేవారు గానీ తర్వాత తరం నటులుగా సక్సెస్ అయిన వారంతా ఆస్తులు బాగానే కూడబెడుతున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. వైవిథ్యమైన నటుడు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్న నటుడు. ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాల్లోనూ నటిస్తున్నారు.
అలాంటి అనుపమ్ ఖేర్ కి సొంత ఇల్లు లేదు అన్న సంగతి ఎంతమందికి తెలుసు. అవును ఆయన ఇప్పటికీ అద్దె ఇంట్లోనూ ఉంటున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. `సొంత ఇంటిని కొనగూడదని నిర్ణయించుకున్నా. అందుకే ఇప్పటికీ అద్దె ఇంట్లో ఉంటున్నా. ఎవరి కోసం ఓ సొంత ఇంటిని కొనుగోలు చేయాలి. ఆ ఇంటికి పెట్టే డబ్బును బ్యాంక్ లో వేసి వచ్చే వడ్డీతో ఇంటి రెంట్ కడితే బాగుంటుంది అన్నది నా భావన. భవిష్యత్ లో ఆస్తుల పంపకం విషయంలో పిల్లల మధ్య గొడవలు రావొచ్చు. అందు వల్ల ఆస్తులు కంటే చేతిలో డబ్బు ఉంటే సరిసమానంగా పంచితే సరిపోతుంది.
నేను వరుసగా విజయాలు అందుకున్న సమయంలో తన కోసం ఓ సొంత ఇల్లు కొనమని అడిగింది. ఆమె కొరిక మేరకు కొని ఇచ్చా. నా తండ్రి ఉన్నప్పుడు అంతా అక్కడే ఉండే వాళ్లం. ఆయన మరణించిన తర్వాత మేము ఆ ప్రాంతంలో ఉన్నది చాలా తక్కువ. అందుకే ఆమె సిమ్లాలో ఇల్లు కావాలని అడిగింది. సింగిల్ బెడ్ రూమ్ చాలు అన్నారు. కానీ నేను ఏకంగా ఎనిమిది పడకగదుల ఇల్లు కొనిచ్చా. ఈ విషయంలో నా భార్యకు నాతో మమేకం కావడానికి చాలా సమయం పట్టింది. రతన్ టాటా నాకు ఆదర్శం. ఆయన చాలా సింపుల్ గా జీవించారు. ఉండ టానికి చిన్న ఇల్లు..చిన్న కారు మాత్రమే ఉండేవి. నేను కూడా ఆయనలా ఉండాలనుకుంటున్నా` అన్నారు.