ఏం చేసినా లక్ కలిసి రావట్లేదా..?
మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ కి ఇంకా బ్యాడ్ లక్ కొనసాగుతుంది. కెరీర్ మొదట్లోనే మంచి ఛాన్స్ లు అందుకున్న అనుపమ తర్వాత ఎందుకో గ్రాఫ్ పడిపోతూ వచ్చింది.;

మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ కి ఇంకా బ్యాడ్ లక్ కొనసాగుతుంది. కెరీర్ మొదట్లోనే మంచి ఛాన్స్ లు అందుకున్న అనుపమ తర్వాత ఎందుకో గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఎవరైనా యువ హీరోలతో మొదలు పెట్టి స్టార్ హీరోలకు ప్రమోట్ అవుతారు కానీ అనుపమ కెరీర్ స్టార్టింగ్ లోనే స్టార్స్ తో నటించి రాను రాను యువ హీరోలతో జత కట్టడం చేస్తుంది. ముఖ్యంగా తెలుగులో అనుపమకి మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ అవకాశాలు మాత్రం పెద్దగా లేవు.
అనుపమ చేస్తున్న సినిమాలు కూడా పెద్దగా ప్రభావితం చూపించటేదు. అందుకే ఆమెకు అవకాశాలు కూడా సన్నగిల్లాయి. మొదట్లో బొద్దుగా ముద్దుగా ఉన్న అనుపమ సన్న బడితే అవకాశాలు వస్తాయన్న సలహా ఎవరైనా ఇచ్చారో లేదా ఆమెకే ఆలోచన వచ్చిందో కానీ సడెన్ గా కొంత గ్యాప్ తీసుకుని స్లిమ్ గా మారి కనిపించింది. ఐతే అనుపమ లో ఈ మేకోవర్ ఆమె ఫ్యాన్స్ కి కూడా పెద్దగా రుచించలేదు.
అందుకే అనుపమ సినిమాలు చేస్తున్నా ఆశించిన క్రేజ్ తెచ్చుకోవట్లేదు. అంతేకాదు ఇదివరకు గ్లామర్ షో విషయంలో కాస్త ఆలోచిస్తూ ఉన్న అనుపమ ఈమధ్య లిప్ లాక్, గ్లామర్ షోస్ కూడా చేస్తూ కనిపిస్తుంది. అయినా కూడా అమ్మడి రేంజ్ పెరగట్లేదు. ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం అన్నట్టు తప్ప సరైన టార్గెట్ తో అమ్మడు దిగుతున్నట్టు కనిపించట్లేదు.
అనుపమ పరమేశ్వరన్ ఎంట్రీ ఇచ్చిన టైం లో స్టార్ మెటీరియల్ అనిపించగా ఆమె చేసిన సినిమాలు వచ్చిన ఫలితాల వల్ల కెరీర్ డౌన్ ఫాల్ అవుతూ వచ్చింది. ఐతే మళ్లీ అమ్మడు కెరీర్ పుంజుకోవాలని ప్రయత్నిస్తున్నా వర్క్ అవుట్ అవ్వట్లేదు. ఇక సినిమాలతో పని అవ్వట్లేదు అని ఫోటో షూట్స్ తో అలరిస్తుంది అమ్మడు. ఫోటో షూట్స్ తో పర్వాలేదు అనిపించినా సినిమా ఛాన్స్ లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. ఐతే అనుపమ ఫ్యాన్స్ మాత్రం ఆమె కంబ్యాక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అమ్మడు తెలుగులో పరదా సినిమా చేస్తుంది. ఆ సినిమాతో పాటు కోలీవుడ్ స్టార్ విక్రం తనయుడు ధృవ్ విక్రం తో ఒక సినిమా చేస్తుంది. ఈమధ్యనే ప్రదీప్ రంగనాథ్ తో చేసిన డ్రాగన్ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.