లిల్లీ నుంచి కీర్తి వరకు.. వావ్ అనిపిస్తున్న అనుపమ
మలయాళ ప్రేమమ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ఇవాళ తన 29వ పుట్టినరోజును జరుపుకుంటుంది.
మలయాళ ప్రేమమ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ఇవాళ తన 29వ పుట్టినరోజును జరుపుకుంటుంది. అ..ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనుపమ, తక్కువ కాలంలోనే మంచి నటిగా, పక్కింటి అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా టిల్లూ స్వ్కేర్ సినిమాలో లిల్లీ జోసెఫ్ గా నటించి అందరినీ ఆకట్టుకుంది అనుపమ.
టిల్లూ స్వ్కేర్ లో రెండు విభిన్న షేడ్స్ లో నటించి అనుపమ తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. సినిమా మొదట్లో లిల్లీ జోసెఫ్ పాత్ర పెద్దగా ఆకట్టుకోనప్పటికీ, ఆ తర్వాత లిల్లీ జోసెఫ్ ఐఎస్ఎఫ్ గూఢచారి అని రివీల్ అయ్యాక మాత్రం ఓ రేంజ్ లో క్లిక్ అయింది. ఓ వైపు ప్రేయసిగా, మరోవైపు సీక్రెట్ ఏజెంట్ గా అనుపమ ఆ పాత్రను పండించిన తీరు విమర్శకుల ప్రశంసల్ని కూడా అందుకుంది.
ఇదిలా ఉంటే అనుపమ ప్రస్తుతం డ్రాగన్ అనే తమిళ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో కూడా అనుపమ చాలా భిన్నమైన పాత్రలో కనిపించనుంది. రాఘవన్ మాజీ ప్రేయసి కీర్తి పాత్రలో అనుపమ డ్రాగన్ సినిమాలో నటించింది. ఇప్పటికే రిలీజైన డ్రాగన్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ లో అనుపమ చాలా సింపుల్ గా కనిపించింది.
కథ మొత్తంలో తన ప్రియుడికి సపోర్ట్ చేసే పాత్రలో అనుపమ డ్రాగన్ సినిమాలో కనిపించనుంది. టిల్లూ స్వ్కేర్ లోని లిల్లీ పాత్రకు, డ్రాగన్ లోని కీర్తి పాత్రకు ఏ మాత్రం పొంతన కనిపించదు. ఇంకా చెప్పాలంటే ఆ రెండు పాత్రలు చేసింది ఒకరేనా అనే అనుమానం కలిగించేలా అనుపమ ఆ పాత్రల్లో ఒదిగిపోయింది.
ఫిబ్రవరి 21న డ్రాగన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. కాలేజ్ స్టూడెంట్ అయిన రాఘవ బ్రేకప్ తర్వాత అనుకోని విధంగా మోసపోతాడు. రాఘవ మోసానికి గురవుతున్నప్పుడు కీర్తి పాత్ర అతని జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందనే దానిపై డ్రాగన్ కథ నడవనుంది. డ్రాగన్ సినిమాతో అనుపమ ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి మరి.