అనుపమ అలాగే కంటున్యూ అవుతుందా?
అయితే అనుపమ జర్నీ ఇకపై ఎలా ఉంటుంది? అన్నది ఆసక్తికరం. ఇప్పటిలాగే గ్లామర్ బ్యూటీగా కొనసాగుతుందా? మళ్లీ పెర్మార్మెన్స్ ఓరియేంటెడ్ చిత్రాల వైపు వెళ్తుందా? అన్నది చూడాలి.
మాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. పెర్మార్మెన్స్ ఓరియేంటెడ్ పాత్రలు చేసినంత కాలం అమ్మడికి తగిన గుర్తింపు దక్కలేదు. 'ప్రేమమ్' నుంచి 'రాక్షసుడు' వరకూ అదే పంథాలో కొనసాగింది. వాటిలో కొన్ని విజయాలున్నా గ్లామర్ పాత్రల్ని మించిన ఐడెంటిటీ అయితే దక్కలేదు. దీంతో లాభం లేదనుకున్న అమ్మడు అప్పటివరకూ ఉన్న రూల్స్ అన్నింటిని ఒక్కసారిగా బ్రేక్ చేసింది.
'రౌడీబోయ్స్' లో అమ్మడు గ్లామర్ క్వీన్ గా ఆకట్టుకుంది. ఇంటిమేట్ సన్నివేశాలు..పెదవి ముద్దులతో బోల్డ్ బ్యూటీలకు తానేం తక్కువ కాదని ప్రూవ్ చేసింది. ఇటీవల రిలీజ్ అయిన 'టిల్లుస్క్వేర్' తో అనుపమని మించిన బోల్డ్ బ్యూటీ ఎవరు? అనిపించేలా చెలరేగింది. ఇంగ్లీష్ బ్యూటీలు..బాలీవుడ్ బ్యూటీలు పెదవి ముద్దుల్లో ఎంతలా ఒదిగిపోతారో? అంతకు మించి అనుపమని! అని రుజువు చేసింది. ఈ రెండు సినిమాల మధ్యలో 'కార్తికేయ-2' లో డీసెంట్ రోల్ పోషించి పాన్ ఇండియా లోనూ ఫేమస్ అయింది.
అయితే అనుపమ జర్నీ ఇకపై ఎలా ఉంటుంది? అన్నది ఆసక్తికరం. ఇప్పటిలాగే గ్లామర్ బ్యూటీగా కొనసాగుతుందా? మళ్లీ పెర్మార్మెన్స్ ఓరియేంటెడ్ చిత్రాల వైపు వెళ్తుందా? అన్నది చూడాలి. టిల్లుస్క్వేర్ విజయంతో భవిష్యత్ లో ఎలాంటి అవకాశాలు అందుకుంటుంది? అన్నది అంతే సస్పెన్స్ గా మారింది. సాధారణంగా ఏ హీరోయిన్ అయినా సక్సెస్ ఫాంని కొనసాగించడానికే చూస్తుంది. దర్శక-నిర్మాతలు అలాంటి వారిని వదులకోరు. మరి అనుపమ కెరీర్ ని ఎలా ప్లాన్ చేసుకుంటుందో చూడాలి.
ప్రస్తుతానికి అనుపమ చేతిలో కొత్త అవకాశాలైతే లేవు. మాలీవుడ్ లో మాత్రం ఓ సినిమాలో నటిస్తుంది. తమిళ్ లోనూ కొన్ని సినిమాలు చేసింది. కానీ ఈ రెండు ఇండస్ట్రీలు కంటే టాలీవుడ్ లోనే బాగా ఫేమస్ అయింది. మరి ఈ వ్యత్యాసం ఆధారంగా ఇక్కడే కెరీర్ ని మరింత సీరియస్ గా ముందుకు తీసుకెళ్తుందా? లేదా? అన్నది చూడాలి.