ఆ సీన్ లో అలా చేశాడు.. చాలా బాధేసిందన్న అనుప్రియ!

పోటుగాడు, పాఠశాల వంటి టాలీవుడ్ మూవీస్ తో బాలీవుడ్ నటి అనుప్రియ గోయెంకా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.;

Update: 2025-04-03 09:22 GMT
Anupriya Goenka Opens Up About Intimate Scene Shoot

పోటుగాడు, పాఠశాల వంటి టాలీవుడ్ మూవీస్ తో బాలీవుడ్ నటి అనుప్రియ గోయెంకా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అదే సమయంలో బీటౌన్ లో టైగర్, పద్మావత్, పాంచాలి, అసుర్, ఆశ్రమ్ ప్రాజెక్టులతో ఆడియన్స్ ను తెగ మెప్పించిన అమ్మడు.. ఇప్పుడు బిజీ బిజీగా గడుపుతుందనే చెప్పాలి!

అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఇంటిమేట్‌ సీన్‌ షూటింగ్‌ లో జరిగిన అనుభవాన్ని షేర్ చేసుకుంది అనుప్రియ. ఆ సీన్ డిమాండ్ చేయకపోయినా సదరు నటుడు తనతో కావాలనే అసభ్యకరంగా బిహేవ్ చేశారని వాపోయిన ఆమె.. పూర్తి వివరాలు మాత్రం బయటపెట్టలేదు. కేవలం తన బాధను పంచుకుంది!

"ఇంటిమేట్ సీన్ షూట్ చేయడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సదరు సీన్ లో నా శరీరంపై అసౌకర్యమైన దుస్తులు ఉన్నాయి. చిత్రీకరణ సమయంలో సీన్ కోసం నా నడుము పట్టుకుని కిస్ చేస్తేనే సరిపోతుంది. మేకర్స్ రాసుకున్న స్క్రిప్ట్ లో కూడా ఉంది. కానీ ఆ యాక్టర్ మాత్రం కాస్త అతిగా ప్రవర్తించాడు" అని చెప్పింది.

"నడుముపై కాకుండా మరో చోట చేయి వేశాడు. అప్పుడు చాలా బాధపడ్డాను. నేను ఎందుకు అలా చేస్తున్నావని అడగొచ్చు. కానీ నేను అలా చేయలేదు. ఒకవేళ అడిగినా పొరపాటులో జరిగిందని చెబుతాడు. అందుకే ఊరుకున్నా. ఏం తిట్టలేదు. ఆ తర్వాత టేక్ లో మాత్రం అలా చేయొద్దని చెప్పాను" అని తెలిపింది.

"ఆ సీన్ షూటింగ్ లో సదరు హీరో ఉద్వేగానికి లోనయ్యాడు. నేను మాత్రం కంట్రోల్ చేసుకున్నాను. నిజానికి అలా జరగకూడదు. చాలా అసౌకర్యంగా భావించాను. నా కెరీర్ లో ఇలా రెండు సార్లు జరిగింది" అని అనుప్రియ గోయెంకా చెప్పింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి.

కొద్ది రోజుల క్రితం హీరోయిన్ షాలిని పాండే చేసిన కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. ఓ సినిమా షూటింగ్ సమయంలో తాను డ్రెస్ ఛేంజ్ చేసుకుంటూ ఉంటే.. ఒక డైరెక్టర్ ఏకంగా కారవాన్ లోపలకు వచ్చేశారని తెలిపింది. అప్పుడు కూడా ఆమె పేరు చెప్పకపోగా.. సదరు వ్యక్తిపై ఫుల్ ఫైర్ అయ్యానని, గట్టిగా అరిచేశానని చెప్పింది. కానీ ఇప్పుడు అనుప్రియ జస్ట్ తాను చెప్పానని పేర్కొంది.

Tags:    

Similar News