బోల్డ్ బ్యూటీ ఎగ్జిట్ పై డైరెక్టర్ కొత్త సస్పెన్స్!
ఓ స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుందని మేకర్స్ దీపికా పదుకొణే..కత్రినా కైప్ లాంటి భామల్ని పరిశీలించారు.
'ఆషీకీ' ప్రాంచైజీ నుంచి థర్డ్ ఇన్ స్టాల్ మెంట్ కూడా రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటిస్తుండగా అనురాగ్ బసు తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాంచైజీలో హీరోయిన్ అత్యంత కీలకమైన నేపథ్యంలో ఆ పాత్ర ఎవరు ? పోషిస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఓ స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుందని మేకర్స్ దీపికా పదుకొణే..కత్రినా కైప్ లాంటి భామల్ని పరిశీలించారు. కానీ ఎందుకనో వాళ్లకంటే కొత్త నటి అయితే బాగుటుం దని మరో ఆలోచన మెదిలింది.
ఈ నేపథ్యంలో ఆ స్థానంలో యువ నటి ఆకాంక్ష శర్మని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త తెరపైకి వచ్చింది. దాదాపు అమెనే మేకర్స్ ఖరారు చేసే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియాలో బలమైన ప్రచారం జరిగింది. అటుపై కొన్ని రోజులకు అదే పాత్రకు `యానిమల్` తో సంచలనమైన త్రిప్తీ డిమ్రీని ఎంపిక చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. త్రిప్తీ ఎంట్రీ వెనుక మరో కారణం కూడా బలంగా వినిపించింది.
ప్రత్యేకించి త్రిప్తీ తెలుగులో ఆమె ఎంతో సంచలనమైన బ్యూటీ. యానిమల్ తర్వాత నటిగా మరింత బిజీ అయింది. ఈ నేపథ్యంలో కార్తీక్ ఆర్యన్ కి పర్పెక్ట్ జోడీగా త్రిప్తీ సెట్ అవుతుందని తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో ప్రాజెక్ట్ నుంచి త్రిప్తీ డిమ్రీని తొలగించారే ప్రచారం కూడా మొదలైంది. లుక్ టెస్ట్ లో ఆమె ఫెయిలవ్వడంతో దర్శకుడు అనురాగ్ బస్ ఆమెకి ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేసినట్లు ఓ వార్త వైరల్ అయింది. నెట్టింట నెటి జనులు కూడా ఈ ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసారు.
దీంతో నిజంగానే త్రిప్తీని తొలగించారా? అన్న సందేహం మరింత బలపడింది. అయితే త్రిప్తీ ఫాలోవర్స్ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించారు. తాజాగా ఈ అంశంపై అనురగ్ బసు కూడా స్పందించారు. నెట్టింట జరిగే వాదనలు, ప్రచారం హాస్యాస్పదంగా ఉందన్నారు. దీంతో త్రిప్తీ డిమ్రీ హీరోయిన్ల లిస్ట్ నుంచి ఇంకా ఎగ్జిట్ అవ్వలేదని తెలుస్తోంది.