రాజమౌళి అంటే ఇది.. ఆ కామెంట్స్ 100% కరెక్ట్!
జక్కన్న అంటే పేరు కాదు.. ఒక బ్రాండ్ అని అంతా ఫిక్స్ అయ్యేలా చేశారు.;

దర్శకధీరుడు రాజమౌళి.. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన తొలి దర్శకుడు ఆయనేనని చెప్పడంలో ఎవరికి ఎలాంటి డౌట్ అక్కర్లేదు. తన మేకింగ్ అండ్ టాలెంట్ తో వరల్డ్ వైడ్ గా ఉన్న కొన్ని కోట్ల మంది సినీ ప్రియులను మెప్పించారు. జక్కన్న అంటే పేరు కాదు.. ఒక బ్రాండ్ అని అంతా ఫిక్స్ అయ్యేలా చేశారు.
తన గత మూవీ ఆర్ఆర్ఆర్ తో ఏకంగా ఆస్కార్ అవార్డునే తీసుకొచ్చారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ బడ్జెట్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రీసెంట్ గా సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే జక్కన్న మేకింగ్ పై నమ్మకంతో అంతా ధీమాగా ఉన్నారని చెప్పాలేమో.
అదే సమయంలో రాజమౌళిని ఉద్దేశించి రీసెంట్ గా డైరెక్టర్, యాక్టర్ అనురాగ్ కశ్యప్ చేసిన కామెంట్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. దీంతో జక్కన్న అంటే ఇది అని నెట్టింట ఫుల్ గా కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. బాలీవుడ్ టు మాలీవుడ్.. ఎందరో ఆయనకు బిగ్ ఫ్యాన్స్ అని సోషల్ మీడియాలో గుర్తు చేస్తున్నారు.
రీసెంట్ గా ఓ కార్యక్రమానికి వెళ్లిన అనురాగ్ కశ్యమ్.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులను ఉద్దేశించి మాట్లాడారు. ఆ సమయంలో విద్యార్థులకు అవకాశాలు కల్పించండని, వాళ్లని సినిమాలు చూడనివ్వండని, పుస్తకాలు చదవనివ్వండని కోరారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుందని గుర్తు చేశారు.
అదే సమయంలో ఎగ్జాంపుల్ అంటూ.. రాజమౌళి పేరు ప్రస్తావించారు. మనకు ఇప్పుడు ఒక రాజమౌళి ఉన్నారని, కానీ ఆయన్ను చూసి సుమారు 10 మంది డూప్లికేట్ రాజమౌళిలు పుట్టుకొచ్చారని వ్యాఖ్యానించారు. ఆయన్ని కాపీ కొట్టాలనే వీరంతా ట్రై చేస్తారని, కానీ ఆయన ఐడియాలు మాత్రమే ఒరిజినల్ అని చెప్పారు.
కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తీసిన కేజీఎఫ్ మూవీ కోసం మాట్లాడుతూ.. ఆ సినిమా ఒక ట్రెండ్ గా తీసుకొని అందరూ అలాంటి సినిమాలే చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అయితే అనురాగ్ కశ్యప్ వ్యాఖ్యలు నిజమేనని నెటిజన్లు అంటున్నారు. 100 శాతం కరెక్ట్ అని చెబుతున్నారు. రాజమౌళి ఐడియాలను ఇమిటేట్ చేయాలని ట్రై చేసి కొందరు నష్టపోతున్నారని గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా జక్కన్న క్రేజే వేరు అని కొనియాడుతున్నారు.