భాగమతి.. ఉన్నట్లా లేనట్లా?

అనుష్క శెట్టి కెరియర్ లో సోలోగా ‘అరుందతి’ తర్వాత బెస్ట్ మూవీ అంటే ‘భాగమతి’ అని చెప్పొచ్చు.

Update: 2024-09-30 05:22 GMT

అనుష్క శెట్టి కెరియర్ లో సోలోగా ‘అరుందతి’ తర్వాత బెస్ట్ మూవీ అంటే ‘భాగమతి’ అని చెప్పొచ్చు. ‘బాహుబలి 2’ తర్వాత థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఏకంగా 50 కోట్లకి పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఆమె రెండు వేరియేషన్స్ లో నటించి తన పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసింది. అశోక్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ అశోక్ ‘భాగమతి’ చిత్రాన్ని హిందీలో ‘దుర్గావతి’ పేరుతో రీమేక్ చేశారు. ఆ మూవీ డిజాస్టర్ అయ్యింది.

తరువాత హిందీలో ఓ రొమాంటిక్ కామెడీ మూవీ చేశాడు. ఇది వర్క్ అవుట్ కాలేదు. దీంతో మరల తెలుగులోకి వచ్చి ‘భాగమతి’ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే అనుష్క ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. యూవీ క్రియేషన్స్ ఈ సీక్వెల్ ని నిర్మించనున్నారు. ‘భాగమతి’ కంటే పవర్ ఫుల్ గా ఈ సీక్వెల్ స్టోరీ ఉంటుందనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని తెలుస్తోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ అశోక్ ఈ సీక్వెల్ పై స్పష్టత ఇచ్చారు. మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాలో కథాంశం చాలా అద్భుతంగా ఉంటుందని, అనుష్క క్యారెక్టర్ ని కూడా చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేసినట్లు చెప్పారు. అయితే ఈ సినిమా గురించి మరో ఇంటరెస్టింగ్ ప్రచారం కూడా నడుస్తోంది. నిజానికి అనుష్క ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కూడా స్క్రిప్ట్ పూర్తిగా వినలేదంట. స్క్రిప్ట్ అంతా విన్నాక నచ్చితేనే చేస్తానని చెప్పినట్లు టాక్.

అందుకే అశోక్ టీమ్ ఇప్పుడు స్క్రిప్ట్ ని పర్ఫెక్ట్ గా సిద్ధం చేసే పనిలో ఉన్నారని అంటున్నారు. త్వరలో ఈ మూవీ సీక్వెల్ కి సంబందించిన ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే అనుష్క ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఫీమేల్ సెంట్రిక్ మూవీ ఒకటి చేస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. దీంతో పాటు మలయాళంలో ఒక పాన్ ఇండియా చిత్రానికి కమిట్ అయ్యింది. టోవినో థామస్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

పీరియాడికల్ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అనుష్క నుంచి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. దీని తర్వాత గ్యాప్ తీసుకోకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలని అనుష్క లైన్ లో పెట్టింది.

Tags:    

Similar News